Telugu Global
Cinema & Entertainment

దేవదాస్ మొదటి రోజు వసూళ్లు

నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మల్టీస్టారర్ కావడం, సినిమాపై కాస్త బజ్ ఉండడంతో మొదటి రోజు దేవదాస్ కు మంచి వసూళ్లు వచ్చాయి. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 4 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. దేవదాస్ సినిమాకు 6 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పటివరకు బాగానే ఉంది కానీ, వీకెండ్ ఈ […]

దేవదాస్ మొదటి రోజు వసూళ్లు
X

నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మల్టీస్టారర్ కావడం, సినిమాపై కాస్త బజ్ ఉండడంతో మొదటి రోజు దేవదాస్ కు మంచి వసూళ్లు వచ్చాయి. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 4 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. దేవదాస్ సినిమాకు 6 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఇప్పటివరకు బాగానే ఉంది కానీ, వీకెండ్ ఈ సినిమా పరిస్థితి ఏంటనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే దేవదాస్ సినిమా ప్రస్తుతం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. కొంతమంది సినిమా బాగుందని అంటుంటే.. చాలామంది మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా ఎంత సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇదొక ఎత్తయితే వీకెండ్ తర్వాత, సోమవారం నుంచి ఈ నెగెటివ్ టాక్ తో దేవదాస్ సినిమా ఎలా ముందుకు వెళ్తుందనేది మరో ప్రశ్న. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 1.68 కోట్లు
సీడెడ్ – రూ. 0.71 కోట్ల
ఉత్తరాంధ్ర – రూ. 0.58 కోట్లు
ఈస్ట్ – రూ. 0.39 కోట్లు
వెస్ట్ – రూ. 0.26 కోట్లు
కృష్ణా – రూ. 0.33 కోట్లు
నెల్లూరు – రూ. 0.19 కోట్లు

First Published:  28 Sep 2018 7:15 AM GMT
Next Story