Telugu Global
National

ప్రపంచ మహిళా టీ-20 టోర్నీకి భారత కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్

నవంబర్ 9 నుంచి విండీస్ వేదికగా మహిళా ప్రపంచకప్ గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో భారత్ ఢీ కరీబియన్ ద్వీపాలు వేదికగా నవంబర్ లో జరిగే 2018 ప్రపంచ మహిళా టీ-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత మహిళా జట్టుకు స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. నవంబర్ 9 నుంచి 24 వరకూ జరిగే ఈటోర్నీలో పాల్గొనే భారత జట్టులో వెటరన్ మిథాలీ రాజ్, యువఓపెనర్ స్మృతి మంథానాలకు సైతం చోటు దక్కింది. […]

ప్రపంచ మహిళా టీ-20 టోర్నీకి భారత కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్
X
  • నవంబర్ 9 నుంచి విండీస్ వేదికగా మహిళా ప్రపంచకప్
  • గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో భారత్ ఢీ

కరీబియన్ ద్వీపాలు వేదికగా నవంబర్ లో జరిగే 2018 ప్రపంచ మహిళా టీ-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత మహిళా జట్టుకు స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.

నవంబర్ 9 నుంచి 24 వరకూ జరిగే ఈటోర్నీలో పాల్గొనే భారత జట్టులో వెటరన్ మిథాలీ రాజ్, యువఓపెనర్ స్మృతి మంథానాలకు సైతం చోటు దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూప్- బీలో భారత్ పోటీపడనుంది.

గయానా వేదికగా నవంబర్ 9న జరిగే తొలిరౌండ్ పోటీలో న్యూజిలాండ్ తో, నవంబర్ 11న పాకిస్థాన్, నవంబర్ 15న ఐర్లాండ్, 17 ఆస్ట్రేలియాజట్లతో భారత్ పోటీపడుతుంది.

భారతజట్టులో చోటు సంపాదించిన ఇతర ప్రధాన ప్లేయర్లలో… జెమీమా రోడ్రిగేస్, వేదా కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తాన్యా భాటియా, పూనం యాదవ్, రాధా యాదవ్, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, హేమలత, మానసి, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి ఉన్నారు.

First Published:  28 Sep 2018 6:08 AM GMT
Next Story