Telugu Global
Cinema & Entertainment

తన కోరికను బయటపెట్టిన పూజా హెగ్డే

గత కొంత కాలంగా తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో బయోపిక్ ల హవా ఒక రేంజ్ లో నడుస్తోంది. ఏడాదికి కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో బయోపిక్స్ కూడా చాలానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ యొక్క జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. ఆమె మరెవరో కాదు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా. ఈమె మీద బయోపిక్ తీయడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే […]

తన కోరికను బయటపెట్టిన పూజా హెగ్డే
X

గత కొంత కాలంగా తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో బయోపిక్ ల హవా ఒక రేంజ్ లో నడుస్తోంది. ఏడాదికి కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో బయోపిక్స్ కూడా చాలానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ యొక్క జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. ఆమె మరెవరో కాదు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా.

ఈమె మీద బయోపిక్ తీయడానికి గత కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ తరహా బయోపిక్ లలో నటించేందుకు ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తి చూపించడం విశేషం.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పూజా హెగ్డే మాట్లాడుతూ “సానియా మిర్జా అలాగే క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లు తీస్తే నటించాలన్న ఆసక్తి ఉంది. ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా ఆ బయోపిక్స్ లో నటిస్తాను” అంటూ తన కోరికను బయటపెట్టింది పూజా హెగ్డే.

పూజా హెగ్డే ఫిజిక్ అథ్లెట్స్ బాడీ కి దగ్గరగా ఉండటంతో ఇలాంటి బయోపిక్స్ కి ఖచ్చితంగా సెట్ అవుతుందని అంటున్నారు.

First Published:  28 Sep 2018 12:22 AM GMT
Next Story