Telugu Global
National

రోడ్డుపైనే పోస్టుమార్టం చేసిన రాజస్థాన్‌ డాక్టర్లు!

వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు సాధిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పలు చెబుతున్నా మనం ఎక్కడున్నామో అనేక ఉదంతాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో రోడ్డుపక్కనే పోస్టుమార్టం నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఉదంతంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు మహిళల భౌతిక కాయాలకు మానవతా దృక్పథంతో కుటుంబాల అభ్యర్థనతో అలా రోడ్డు పక్కనే పోస్టుమార్టం […]

రోడ్డుపైనే పోస్టుమార్టం చేసిన రాజస్థాన్‌ డాక్టర్లు!
X

వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు సాధిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పలు చెబుతున్నా మనం ఎక్కడున్నామో అనేక ఉదంతాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో రోడ్డుపక్కనే పోస్టుమార్టం నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది.

రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఉదంతంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు మహిళల భౌతిక కాయాలకు మానవతా దృక్పథంతో కుటుంబాల అభ్యర్థనతో అలా రోడ్డు పక్కనే పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఆ గ్రామానికి చుట్టపక్కల దాదాపు మరో 100 కిలోమీటర్లలోపు మార్చురీ సదుపాయం ఉన్న ఆసుపత్రి లేకపోవడమే దీనికి కారణమట.

బార్మర్‌లోని గదారా రోడ్‌లో నివసిస్తున్న మాయా కన్వార్‌ (30) ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌కు గురైంది. ఆమె అరుపులు విన్న ఆమె అత్త మామలు వచ్చి రక్షించబోయి వారు కూడా షాక్‌ కు గురయ్యారు. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా అత్తాకోడళ్లిద్దరూ మరణించినట్లు ధృవీకరించారు. మామ పదమ్‌ సింగ్‌కు ప్రస్తుతం వైద్యం జరుగుతోంది.

సమీపంలో మార్చురీ లేకపోవడంతో బాధిత కుటుంబం అభ్యర్థన మేరకు ఆసుపత్రి వెలుపలే పోస్టుమార్టం నిర్వహించామని, పోస్టు మార్టం సందర్భంగా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నామని బార్మర్‌ ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కమలేష్‌ చౌదరి తెలిపారు.

First Published:  28 Sep 2018 8:30 AM GMT
Next Story