Telugu Global
Cinema & Entertainment

శాకాహారిగా మారిన మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ తమన్న శాకాహారిగా మారిపోయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది తమన్న. ఇకపై తను నాన్-వెజిటేరియన్ తిననని తెగేసి చెప్పేసింది. ఇంత సడెన్ గా తమన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆమె పెంచుకుంటున్న పెంపుడు కుక్క. తమన్న పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇక కోలుకోవడం కూడా కష్టమే అన్నారు డాక్టర్లు. దీంతో తన పెంపుడు కుక్క కోలుకోవడం కోసం పూర్తిగా నాన్-వెజ్ మానేస్తున్నట్టు ప్రకటించింది తమన్న. ఈమె మాంసాహారం మానేస్తే కుక్క […]

శాకాహారిగా మారిన మిల్కీబ్యూటీ
X

మిల్కీబ్యూటీ తమన్న శాకాహారిగా మారిపోయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది తమన్న. ఇకపై తను నాన్-వెజిటేరియన్ తిననని తెగేసి చెప్పేసింది. ఇంత సడెన్ గా తమన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆమె పెంచుకుంటున్న పెంపుడు కుక్క.

తమన్న పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇక కోలుకోవడం కూడా కష్టమే అన్నారు డాక్టర్లు. దీంతో తన పెంపుడు కుక్క కోలుకోవడం కోసం పూర్తిగా నాన్-వెజ్ మానేస్తున్నట్టు ప్రకటించింది తమన్న. ఈమె మాంసాహారం మానేస్తే కుక్క కోలుకుంటుందా అనే లాజిక్కులు మాత్రం తీయొద్దు. ఎవరి నమ్మకాలు వాళ్లవి.

అన్నట్టు తమన్న మంచి భోజన ప్రియురాలు. మరీ ముఖ్యంగా నాన్-వెజ్ వంటలంటే మరీ ఇష్టం. అలాంటి అమ్మాయి సడెన్ గా మాంసాహారం మానేస్తానని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గట్టిగా తలుచుకుంటే నాన్-వెజ్ మానేయడం పెద్ద సమస్య కాదంటోంది తమన్న. ఇప్పటికే మాంసాహారం మానేశానని, కొన్ని రోజులు గడిస్తే నాన్-వెజ్ తినాలనే కోరిక పూర్తిగా తగ్గిపోతుందని అంటోంది తమన్న

First Published:  27 Sep 2018 11:45 PM GMT
Next Story