Telugu Global
National

బిజెపి వ్యూహం.... "సెల్‌ఫోన్ ప్ర‌ముఖ్‌" ల‌తో వ్యాట్సాప్ ప్ర‌చారం

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్, బిజెపిలు పోటా పోటీగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. రెండు పార్టీలు బూత్ స్థాయి నుంచే త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభిస్తున్నాయి. బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా ఇప్ప‌టికే బూత్ యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేశారు. నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ఓట‌ర్ల లిస్టును త‌న‌కు పంపాల‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా 9,27,533 పోలింగ్ స్టేష‌న్లు ఉండ‌గా…. దాదాపు అన్ని పోలింగ్ […]

బిజెపి వ్యూహం.... సెల్‌ఫోన్ ప్ర‌ముఖ్‌ ల‌తో వ్యాట్సాప్ ప్ర‌చారం
X

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్, బిజెపిలు పోటా పోటీగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. రెండు పార్టీలు బూత్ స్థాయి నుంచే త‌మ ప్ర‌చారాన్ని ప్రారంభిస్తున్నాయి. బిజెపి అధ్య‌క్షుడు అమిత్ షా ఇప్ప‌టికే బూత్ యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేశారు. నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ఓట‌ర్ల లిస్టును త‌న‌కు పంపాల‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

దేశ వ్యాప్తంగా 9,27,533 పోలింగ్ స్టేష‌న్లు ఉండ‌గా…. దాదాపు అన్ని పోలింగ్ స్టేష‌న్ల ప‌రిధిలో బిజెపి సెల్ ఫోన్ ప్ర‌ముఖ్‌ను నియ‌మించ‌నున్నారు. వీరంద‌రూ ఆయా ప్రాంతాల్లో వ్యాట్సాప్ ద్వారా ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. పార్టీ సోష‌ల్ మీడియా విభాగం అందించే ఆడియో, వీడియో, టెక్ట్స్‌, గ్రాఫిక్, కార్టూన్ మెటీరియ‌ల్‌ను పోలింగ్ స్టేష‌న్ల వారీగా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేయ‌నున్నారు.

సెల్‌ఫోన్ ప్రముఖ్‌లు త‌మకు కేటాయించిన అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాట్సాప్ ఉప‌యోగిస్తున్న ఓట‌ర్ల జాబితాను సేక‌రించ‌నున్నారు. ఈ వివ‌రాల‌న్నీఢిల్లీలో అశోకా రోడ్డులో బిజెపి ప్ర‌ధాన కార్యాల‌యంలోని వార్ రూమ్‌కి చేరుకోగానే… ప్ర‌చారం ఉదృతం చేయ‌నున్నారు.

ప్ర‌తి రాష్ట్రంలో సెల్‌ఫోన్ ప్ర‌ముఖ్‌ల‌ను నియ‌మించే బాధ్య‌త‌ను ఆయా రాష్ట్ర ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఆఫీస్ బేర‌ర్ల‌కు అప్ప‌గించారు. సెల్‌ఫోన్ ప్ర‌ముఖ్ త‌నకు అప్ప‌గించిన పోలింగ్ స్టేష‌న్ ప‌రిధిలో మూడు వాట్సాప్ గ్రూపుల‌ను క్రియేట్ చేసి… ఒక్కో గ్రూప్‌లో 256 మంది ఓట‌ర్ల‌తో కాంటాక్ట్‌లో ఉంటాడు. వాట్సాప్ వినియోగం అంత‌గా లేని ప్రాంతాల్లో నోడ‌ల్ పర్స‌న్స్‌ను నియ‌మించ‌నున్నారు.

First Published:  29 Sep 2018 6:09 AM GMT
Next Story