Telugu Global
NEWS

ఒక్క జిల్లాలోనే బాబుగారి సంబరాల ఖర్చు కళ్లు చెదిరే స్థాయిలో!

చంద్రబాబు నాయుడు తీరు ఒక ఈవెంట్ మేనేజర్ వలే ఉంటుందని మొదటి నుంచి వినిపించే అభిప్రాయమే. బాబు సీఎం గా కన్నా ఈవెంట్ మేనేజర్ గా ఎక్కువగా వ్యవహరిస్తాడని అంతా అంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యవహారాన్నీ ఈవెంట్ గా మార్చేస్తూ ఉంటాడు. అయినదానికీ కానిదానికీ సంబరాలు చేసుకొంటూ ఉంటాడు. ఏదో ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని సంబరంగా వ్యవహరించడం చంద్రబాబు నాయుడుకు మామూలే. శంఖుస్థాపనలు, పుష్కరాలు, పండగలు, హారతులు…. ఇలా […]

ఒక్క జిల్లాలోనే బాబుగారి సంబరాల ఖర్చు కళ్లు చెదిరే స్థాయిలో!
X

చంద్రబాబు నాయుడు తీరు ఒక ఈవెంట్ మేనేజర్ వలే ఉంటుందని మొదటి నుంచి వినిపించే అభిప్రాయమే. బాబు సీఎం గా కన్నా ఈవెంట్ మేనేజర్ గా ఎక్కువగా వ్యవహరిస్తాడని అంతా అంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ప్రతి వ్యవహారాన్నీ ఈవెంట్ గా మార్చేస్తూ ఉంటాడు. అయినదానికీ కానిదానికీ సంబరాలు చేసుకొంటూ ఉంటాడు. ఏదో ఒక కార్యక్రమాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని సంబరంగా వ్యవహరించడం చంద్రబాబు నాయుడుకు మామూలే.

శంఖుస్థాపనలు, పుష్కరాలు, పండగలు, హారతులు…. ఇలా చంద్రబాబు నాయడు హడావుడి చేస్తూ ఉంటాడు.

ఈ హడావుడితో వచ్చే నష్టం ఆయనకు ఏమీ లేదు కానీ…. వీటి కోసమని ప్రజల సొమ్మును హరతి కర్పూరంలా కరిగించేస్తూ ఉండటమే చోద్యం. ఒక వ్యవహారంలో అని కాదు…. చంద్రబాబు నాయుడుకు ఈ విషయాల్లో అడ్డూ అదుపూ లేదు. ఈ నేపథ్యంలో ఒక్క జిల్లాలోనే చంద్రబాబు నాయుడు పర్యటనలు, సంబరాలు, ప్రారంభోత్సవాల ఖర్చు గురించి ఆసక్తిదాయకమైన వివరాలు వెల్లడి అవుతున్నాయి.

వీటి ప్రకారం…. ఒక్క గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు నాయుడి సంబరాల ఖర్చులు 18 కోట్ల రూపాయల పైనే అని తెలుస్తోంది. పుష్కరాల్లో చంద్రబాబు స్నానం దగ్గర నుంచి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా చేపట్టిన పురస్కారాల కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగానే ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రభుత్వ ఖర్చే. అంటే ప్రజల డబ్బే. చంద్రబాబు నాయుడు డాబుల కోసం…. ఆయన చేసిన ఉత్తుత్తి ప్రారంభోత్సవాల కోసం ఈ డబ్బున్నంతా ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఒక్క జిల్లాలోనే ఇన్ని కోట్ల రూపాయాలంటే…. చంద్రబాబు నాయుడు మిగతా జిల్లాల్లో చేసిన సంబరాలకు ఏమీ కొదవలేదు. కాబట్టి మొత్తంగా చూస్తే బాబుగారి సంబరాల ఖర్చు ఏ వందల కోట్ల రూపాయల పైనే ఉంటుందని చెప్పవచ్చు.

First Published:  29 Sep 2018 2:09 AM GMT
Next Story