Telugu Global
Cinema & Entertainment

అవును.... ఆ రీమేక్ నిజమే

తమిళ్ లో తెరకెక్కిన 96 అనే సినిమా రీమేక్ పై కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఓ ప్రచారం నడుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందించాడు దిల్ రాజు. అవును నిజమే… 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం అంటూ ప్రకటించాడు దిల్ రాజు. హీరో నానితో కలిసి దిల్ రాజు చెన్నై వెళ్లి మరీ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించి […]

అవును.... ఆ రీమేక్ నిజమే
X

తమిళ్ లో తెరకెక్కిన 96 అనే సినిమా రీమేక్ పై కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఓ ప్రచారం నడుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందించాడు దిల్ రాజు. అవును నిజమే… 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాం అంటూ ప్రకటించాడు దిల్ రాజు.

హీరో నానితో కలిసి దిల్ రాజు చెన్నై వెళ్లి మరీ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించి వచ్చాడంటూ కథనాలు వచ్చాయి. ఇందులో మాత్రం నిజం లేదంటున్నాడు దిల్ రాజు. రీమేక్ వాస్తవమే అయినప్పటికీ, హీరో-హీరోయిన్లు, ఇతర నటీనటులు, దర్శకుడు ఎవరనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు.

అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, 96 రీమేక్ లో నాని నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను దిల్ రాజుకు సూచించింది కూడా నానినే. ట్రయిలర్ విడుదలైన వెంటనే చెన్నై వెళ్లి ఇద్దరూ సినిమా చూసి వచ్చారు. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలకానుంది.

First Published:  29 Sep 2018 8:00 AM GMT
Next Story