Telugu Global
International

ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్

ఫేస్‌బుక్‌ పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ఏకంగా 5కోట్ల వినియోగదారుల ఖాతాలను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సంస్థే ప్రకటించింది. ”వ్యూ యాజ్” ఫీచర్ ద్వారా హ్యాకర్లు చొరబడి ఉండవచ్చని వెల్లడించింది. డేటా దుర్వినియోగం అయిందో లేదో మాత్రం ఇప్పుడే చెప్పలేమంది. ఇటీవల ఫేస్‌బుక్‌పై సైబర్ దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్‌బుక్ సీఈవో జూకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. హ్యాక్ విషయం తెలియగానే వెంటనే తమ వినియోగదారులను […]

ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్
X

ఫేస్‌బుక్‌ పై అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ఏకంగా 5కోట్ల వినియోగదారుల ఖాతాలను హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సంస్థే ప్రకటించింది. ”వ్యూ యాజ్” ఫీచర్ ద్వారా హ్యాకర్లు చొరబడి ఉండవచ్చని వెల్లడించింది.

డేటా దుర్వినియోగం అయిందో లేదో మాత్రం ఇప్పుడే చెప్పలేమంది. ఇటీవల ఫేస్‌బుక్‌పై సైబర్ దాడులు జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్‌బుక్ సీఈవో జూకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు.

హ్యాక్ విషయం తెలియగానే వెంటనే తమ వినియోగదారులను లాగ్‌ఔట్ చేయాల్సిందిగా ఫేస్‌బుక్ సూచించింది. సైబర్‌ దాడి విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించారు. ”వ్యూ యాజ్‌” ఫీచర్ లో ఉన్న సంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని ఈ దాడి జరిగింది. సైబర్‌ దాడి నేపథ్యంలో ప్రైవసీ ఫీచర్‌ అయిన ”వ్యూ యాజ్‌”ను తాత్కాలికంగా నిలిపివేశారు.

First Published:  28 Sep 2018 10:37 PM GMT
Next Story