చెన్నైలో ప్రారంభమైన జెర్సీ సినిమా

ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు నాని. మరో రెండు వారాల తర్వాత జెర్సీ సినిమాను స్టార్ట్ చేస్తాడు. మొన్న ఇంటర్వ్యూలో కూడా నాని ఇదే చెప్పాడు. ఆడియన్స్ కు కూడా అదే తెలుసు. కానీ ఎక్స్ క్లూజివ్ మేటర్ ఏంటంటే.. జెర్సీ సినిమా వర్క్ ప్రారంభమైంది.

చెన్నైలో జెర్సీకి సంబంధించి సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభమైంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు బాణీలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, చెన్నైలో అనిరుద్ తో కలిసి సాంగ్స్ రికార్డింగ్ లో పాల్గొంటున్నాడు.

అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో, అతడికి తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. చివరికి అరవింద సమేత చిత్రం నుంచి కూడా అతడ్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. మళ్లీ ఇన్నాళ్లకు జెర్సీ రూపంలో టాలీవుడ్ లో మరో అవకాశం దక్కించుకున్నాడు అనిరుధ్.

సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. విజయదశమి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.