Telugu Global
National

కొత్త ఓటర్లకు గాలం.... కాంగ్రెస్ న‌యా ప్లాన్.....

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌రికొత్త వ్యూహాల‌తో అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ”లోక్ సంప‌ర్క్‌ అభియాన్” పేరిట ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కావాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో తొలిసారి ఓటు హ‌క్కు పొందిన వారిపై ఫోక‌స్ చేయాల‌ని భావిస్తోంది. దేశంలో వివిధ అంశాల‌పై ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది. గాంధీ జ‌యంతి నుంచి ఇందిర జ‌యంతి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టబోతున్న ”లోక్ సంప‌ర్క్ అభియాన్” గాంధీ జ‌యంతి అయిన అక్టోబ‌ర్ 2న ప్రారంభ‌మై …ఇందిరా గాంధీ […]

కొత్త ఓటర్లకు గాలం.... కాంగ్రెస్ న‌యా ప్లాన్.....
X

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌రికొత్త వ్యూహాల‌తో అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ”లోక్ సంప‌ర్క్‌ అభియాన్” పేరిట ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కావాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో తొలిసారి ఓటు హ‌క్కు పొందిన వారిపై ఫోక‌స్ చేయాల‌ని భావిస్తోంది. దేశంలో వివిధ అంశాల‌పై ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌లిగించేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది.

గాంధీ జ‌యంతి నుంచి ఇందిర జ‌యంతి వ‌ర‌కు

కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టబోతున్న ”లోక్ సంప‌ర్క్ అభియాన్” గాంధీ జ‌యంతి అయిన అక్టోబ‌ర్ 2న ప్రారంభ‌మై …ఇందిరా గాంధీ జ‌యంతి అయిన న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు కొన‌సాగునుంది. మ‌హారాష్ట్ర‌లో సేవాగ్రామ్ నుంచి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. సంప‌ర్క్ అభియాన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి కోటి మంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగుతున్నారు.

బూత్ స్థాయిలో ఓట‌ర్ల‌ను క‌లుస్తూ, స్థానికుల నుంచి నిధులు వ‌సూలు చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు …బూత్ స‌హ‌యోగి పేరిట బూత్ లెవెల్ ప్ర‌చారానికి దిగుతున్నారు. ఒక్కో పోలింగ్ బూత్ ప‌రిధిలో ప‌ది మంది బూత్ స‌హ‌యోగిలు త‌మ ప‌ని మొద‌లు పెడ‌తారు.

రాహుల్ గాంధీ నుంచి లేఖ‌

మొదటిసారి ఓటు వేయబోతున్న కొత్త ఓట‌ర్ల‌పై ఫోక‌స్ పెట్టిన కాంగ్రెస్ వారిని ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ”సంప‌ర్క్ అభియాన్” కార్య‌క్ర‌మంలో భాగంగా వారికి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నుంచి ఓ లెట‌ర్ అంద‌నుంది. అందులో రాహుల్ గాంధీ త‌న అభిప్రాయాల‌ను కొత్త ఓట‌ర్ల‌తో పంచుకోనున్నారు.

శ‌క్తి యాప్ ద్వారా స‌మ‌న్వ‌యం

బూత్ స్థాయిలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సేక‌రించిన ఓట‌ర్ల స‌మాచారాన్ని, నిధుల స‌మాచారాన్ని శ‌క్తి యాప్ ద్వారా సమ‌న్వ‌యం చేయ‌నున్నారు. అదే విధంగా కార్య‌క‌ర్త‌ల ప‌ని తీరు ఏ విధంగా ఉందో కూడా శ‌క్తి యాప్ ద్వారా తెలుసుకోనున్నారు.

ఎల‌క్టోర‌ల్ బాండ్ల విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించి వాటి రూపంలో డొనేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. అదే విధంగా డొనేష‌న్ల స్వీక‌ర‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేందుకు… డొనేష‌న్లు ఇచ్చిన వారికి ర‌శీదులు కూడా ఇవ్వ‌నున్నారు.

2 వేలు దాటిన‌ డొనేష‌న్ల‌కు ఆర్‌టిజిఎస్ ద్వారా, 20 వేలు దాటిన డొనేష‌న్ల‌కు పాన్ నెంబ‌ర్ తీసుకోవ‌డం ద్వారా పార‌ద‌ర్శ‌కత పాటించ‌నున్నారు. స‌హ‌యోగీలు సేక‌రించిన డొనేషన్లలో 50 శాతం ఏఐసిసికి, మిగ‌తా 50 శాతం రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌కు చేర‌నున్నాయి.

మేరా బూత్ మేరా గౌరవ్

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల‌లో కూడా కాంగ్రెస్ ప్ర‌చారంలో దూసుకుపోతోంది. ”మేరా బూత్ మేరా గౌరవ్” అనే కార్య‌క్ర‌మాన్ని రాజ‌స్థాన్‌లో ప్రారంభించి మంచి ఫ‌లితాలు సాధించింది. రాష్ట్రంలో ఉన్న 200ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి నుంచి అనేక విష‌యాల‌ను సేక‌రించారు.

అదే విధానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా అమ‌లు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో వ‌స్తున్న రెస్పాన్స్ కాంగ్రెస్ నేత‌ల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విధానాన్నే జాతీయ స్థాయిలో కూడా అమ‌లు చేసేందుకు సిద్ధ‌మై…”లోక్ సంప‌ర్క్ అభియాన్” పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

First Published:  29 Sep 2018 12:00 AM GMT
Next Story