Telugu Global
International

ఆసియాకప్ లో వారేవ్వా! టీమిండియా

ఏడోసారి టైటిల్ నెగ్గిన టీమిండియా గత 16 ఏళ్లలో ఎనిమిదిసార్లు ఫైనల్స్ కు అర్హత ఎనిమిది ఫైనల్స్ లో ఏడుసార్లు విజేతగా భారత్ ఆసియాకప్ క్రికెట్ లో తనకు ఎదురేలేదని…. రెండో ర్యాంకర్ టీమిండియా మరోసారి చాటుకొంది. వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఏడోసారి ఆసియాకప్ నెగ్గి టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడున్నర దశాబ్దాల ఆసియాకప్ లో టీమిండియా తనకు తానే సాటిగా నిలిచింది. ఆరుజట్ల సమరం ఆసియాకప్ గల్ఫ్ దేశం… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన […]

ఆసియాకప్ లో వారేవ్వా! టీమిండియా
X
  • ఏడోసారి టైటిల్ నెగ్గిన టీమిండియా
  • గత 16 ఏళ్లలో ఎనిమిదిసార్లు ఫైనల్స్ కు అర్హత
  • ఎనిమిది ఫైనల్స్ లో ఏడుసార్లు విజేతగా భారత్

ఆసియాకప్ క్రికెట్ లో తనకు ఎదురేలేదని…. రెండో ర్యాంకర్ టీమిండియా మరోసారి చాటుకొంది. వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఏడోసారి ఆసియాకప్ నెగ్గి టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడున్నర దశాబ్దాల ఆసియాకప్ లో టీమిండియా తనకు తానే సాటిగా నిలిచింది.

ఆరుజట్ల సమరం ఆసియాకప్

గల్ఫ్ దేశం… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన …2018 ఆసియాకప్ క్రికెట్ టోర్నీ సైతం….డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా షోగానే ముగిసింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా గత రెండువారాలుగా సాగిన ఈటోర్నీలో…. మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్, హంకాంగ్ జట్లతో పోటీపడిన టీమిండియా తిరుగులేని విజేతగా నిలిచింది.

ఈ టోర్నీ తొలిదశ మూడుజట్ల గ్రూప్ లీగ్ లో….హాంకాంగ్, పాకిస్థాన్ జట్లను ఓడించిన టీమిండియా…రెండోదశ సూపర్ ఫోర్ రౌండ్లో సైతం… బంగ్లాదేశ్, పాక్ జట్లను చిత్తు చేసినా… 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ ను మాత్రం… టైగా ముగించక తప్పలేదు.

ఉత్కంఠగా ఫైనల్స్…..

ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ…ఎడతెగని ఉత్కంఠతో సాగిన ఫైనల్లో మాత్రం…బంగ్లాదేశ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న టీమిండియా… చివరకు 3 వికెట్ల తో నెగ్గి ఊపిరి పీల్చుకొంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రెండోస్థానంలో ఉన్న టీమిండియాకు… ఆసియాకప్ గెలుచుకోడం ఇది ఏడోసారి కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

గత 36 సంవత్సరాల ఆసియాకప్ రికార్డులను ఓసారి చూస్తే…. గత 16 సంవత్సరాల కాలంలో ఎనిమిదిసార్లు ఫైనల్స్ చేరిన ఒకే ఒక్కజట్టు టీమిండియా మాత్రమే.

ఏడుసార్లు… ఒకే ఒక్కజట్టు…

అంతేకాదు… ఎనిమిది ఫైనల్స్ లో ఏడుసార్లు విన్నర్, ఓసారి రన్నరప్ ట్రోఫీ అందుకొన్న ఏకైకజట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. 1984 లో…. యూఏఈ వేదికగానే శ్రీకారం చుట్టుకొన్న ఆసియాకప్… గత మూడున్నర దశాబ్దాల కాలంలో అంతై ఇంతై అన్నట్లుగా ఎదిగిపోయింది.

ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే ఈటోర్నీ… 36 సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా… ఏడుసార్లు విజేతగా నిలిచిన ఏకైకజట్టు భారత్ మాత్రమే.

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ విజేతగా ఉన్న భారతజట్టు 1984 ప్రారంభ ఆసియాకప్ నుంచి….ప్రస్తుత 14 వ ఆసియాకప్ వరకూ ఏడుసార్లు ట్రోఫీ అందుకొంటే… భారత్ తర్వాతే శ్రీలంక, పాక్…. ఐదుటైటిల్స్ తో శ్రీలంక రెండవ స్థానం, రెండు ఆసియాకప్ ట్రోఫీలతో పాకిస్థాన్ మూడువస్థానంలో ఉన్నాయి.

భారతజట్టు.. 1984, 1988, 1990, 1995, 2008, 2016, 2018 సంవత్సరాలలో ఆసియాకప్ విజేతగా నిలిచింది.

మాజీ చాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకజట్ల జోరు తగ్గి… బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ లాంటి జట్ల దూకుడు పెరగడం…. రెండోర్యాంకర్ టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం… 2018 ఆసియాకప్…. ప్రత్యేకతలుగా మిగిలిపోతాయి.

క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న ఆసియా ఖండంలో…. క్రికెట్ అంటే భారత్, పాక్, శ్రీలంక జట్లు మాత్రమే కాదు… అప్ఘనిస్థాన్ కూడా అని ప్రపంచానికి తొలిసారిగా తెలిసివచ్చింది.

First Published:  29 Sep 2018 5:18 AM GMT
Next Story