Telugu Global
NEWS

కాంగ్రెస్ సీనియ‌ర్లు ఎంపీలుగా పోటీ చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ కేసు హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది. ఢిల్లీలో మాత్రం టికెట్ల వ‌డ‌పోత కార్య‌క్ర‌మం స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే పీసీసీ నుంచి ఓ లిస్ట్ ఢిల్లీ పెద్ద‌ల‌కు చేరిన‌ట్లు స‌మాచారం. అయితే సీనియ‌ర్ నేత‌ల‌ను వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీలుగా పోటీ చేయాల‌ని అధిష్టానం కోరిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో పార్టీ బ‌లంగా ఉంది. ఇక్క‌డ బీజేపీ, టీఆర్ఎస్ లను దెబ్బ కొట్టాలి. అదే స్థాయిలో పార్టీ బ‌లంగా ఉన్న చోట వీలైనన్ని సీట్లు సాధించాలి. ఈ […]

కాంగ్రెస్ సీనియ‌ర్లు ఎంపీలుగా పోటీ చేస్తారా?
X

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ కేసు హాట్ టాపిక్‌గా న‌డుస్తోంది. ఢిల్లీలో మాత్రం టికెట్ల వ‌డ‌పోత కార్య‌క్ర‌మం స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే పీసీసీ నుంచి ఓ లిస్ట్ ఢిల్లీ పెద్ద‌ల‌కు చేరిన‌ట్లు స‌మాచారం. అయితే సీనియ‌ర్ నేత‌ల‌ను వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీలుగా పోటీ చేయాల‌ని అధిష్టానం కోరిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో పార్టీ బ‌లంగా ఉంది. ఇక్క‌డ బీజేపీ, టీఆర్ఎస్ లను దెబ్బ కొట్టాలి. అదే స్థాయిలో పార్టీ బ‌లంగా ఉన్న చోట వీలైనన్ని సీట్లు సాధించాలి. ఈ టార్గెట్‌తో మిష‌న్ తెలంగాణను త‌యారు చేసింద‌ట‌. వ‌చ్చే ఎన్నికల్లో మోడీని గ‌ద్దె దించాలంటే… ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే వీలైనన్ని సీట్లు సాధించాల‌నేది కాంగ్రెస్ ల‌క్ష్యం.

త‌మిళ‌నాడులో 39 సీట్లు ఉన్నాయి. అక్క‌డ డీఎంకేకి చాన్స్ ఉంది. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఉంది. ఇక్క‌డ వీలైన‌న్ని సీట్లు సాధించాలనే కృత నిశ్చ‌యంతో కాంగ్రెస్ నేత‌లు ఉన్నారు. 15 నుంచి 20 సీట్లు క‌ర్నాట‌క‌లో త‌మ ఖాతాలో ప‌డ‌తాయ‌ని అంచ‌నా.

తెలంగాణ‌లో 10కి త‌క్కువ కాకుండా సీట్లు సాధించాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. కేర‌ళ‌లో కూడా ఈసారి త‌మకు విజ‌యావకాశాలు ఉన్నాయ‌ని అంటోంది. దీంతో ద‌క్షిణాదిలో 70కి పైగా స్థానాలు సాధిస్తే మోడీకి మెజార్టీ రాకుండా అడ్డుకొవచ్చ‌ని కాంగ్రెస్ ప్లాన్ గీస్తోంది.

ఇందులో భాగంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేతలు జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, జైపాల్‌రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌ధుయాష్కీతో పాటు ప‌లువురు నేత‌లను ఎంపీలుగా పోటీ చేయాల‌ని ఇప్ప‌టికే అధిష్టానం కోరిన‌ట్లు తెలిసింది. అయితే తెలంగాణ ఎన్నిక‌లు ముగిసిన తర్వాత త‌మ నిర్ణ‌యం చెబుతామ‌ని వారు చెప్పిన‌ట్లు స‌మాచారం.

మొత్తానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ వ్యూహర‌చ‌న ప్రారంభించింది. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితం ఎలా ఉన్నా…. 2019లో మాత్రం కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ క‌ల‌లు కంటోంది.

First Published:  28 Sep 2018 10:30 PM GMT
Next Story