Telugu Global
NEWS

కాంగ్రెస్ తో పొత్తు వద్దన్న టీడీపీ నేతకు సీటు ఇవ్వరా?

కాంగ్రెస్ పార్టీతో గనుక తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే తను ఉరేసుకుంటానని హెచ్చరించాడు టీడీపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ. వాస్తవానికి కేఈ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తే. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. అలా కాంగ్రెస్ లో పని చేసిన నేపథ్యం ఉన్న కేఈ ఇప్పుడిలా కాంగ్రెస్ తో పొత్తు అంటే ఉరేసుకుంటా అనడం విడ్డూరమే. అయితే కేఈ హెచ్చరికలను చంద్రబాబు నాయడు ఖాతరు చేయలేదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ […]

కాంగ్రెస్ తో పొత్తు వద్దన్న టీడీపీ నేతకు సీటు ఇవ్వరా?
X

కాంగ్రెస్ పార్టీతో గనుక తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే తను ఉరేసుకుంటానని హెచ్చరించాడు టీడీపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కేఈ. వాస్తవానికి కేఈ గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తే. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. అలా కాంగ్రెస్ లో పని చేసిన నేపథ్యం ఉన్న కేఈ ఇప్పుడిలా కాంగ్రెస్ తో పొత్తు అంటే ఉరేసుకుంటా అనడం విడ్డూరమే.

అయితే కేఈ హెచ్చరికలను చంద్రబాబు నాయడు ఖాతరు చేయలేదు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపాడు చంద్రబాబు నాయుడు. రేపు ఏపీలో కూడా చేతులు కలపడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి నామమాత్రంగా సీట్లను కేటాయించి పొత్తును పెట్టుకోనున్నాడు చంద్రబాబు. ఈ పొత్తు దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు పన్నెండు సీట్లు కేటాయించనుందని సమాచారం.

వీటిల్లో కేఈ ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ సీటు కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాగానే ఓట్లు వచ్చాయి. ముప్పై వేలకు పైగా ఓట్లను సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కిన అతి తక్కువ నియోజకవర్గాల్లో పత్తికొండ ఒకటి.

వాస్తవానికి అందుకు కారణం చెరుకులపాడు నారాయణ రెడ్డి. ఈయన స్థానికంగా గట్టిగా పని చేసి ఓట్లను సాధించాడు. ఆ ఓట్లే వైసీపీ ఓటమికి కారణం అయ్యాయి.

అనంతరం చెరుకులపాడు కుటుంబం వైసీపీలోకి చేరింది. ఆ తర్వాత నారాయణ రెడ్డి హత్య జరిగింది. అయినప్పటికీ ఈ సీటును కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ తో పొత్తు వద్దు అని వాదించిన నేత సీటే ఇప్పుడు పొత్తులో భాగంగా త్యాగానికి గురయితే అంతకు మించిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

First Published:  30 Sep 2018 4:00 AM GMT
Next Story