Telugu Global
NEWS

మరో నియోజకవర్గం మీద కన్నేసిన పరిటాల?

అనంతపురం జిల్లాలో మరో నియోజకవర్గం మీద పట్టు సాధించాలన్న పరిటాల కుటుంబం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి రాప్తాడు నుంచి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఆమె తనయుడు పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే అందుకు తగిన నియోజకవర్గం మాత్రం ఎంతకూ ఓకే కావడం లేదు. ఈ విషయంలో పలు నియోజకవర్గాల పేర్లను పరిటాల కుటుంబం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు వద్ద వీటి ప్రతిపాదనలు పెట్టారట. అయితే.. బాబు మాత్రం దేనికీ ఓకే చెప్పడం […]

మరో నియోజకవర్గం మీద కన్నేసిన పరిటాల?
X

అనంతపురం జిల్లాలో మరో నియోజకవర్గం మీద పట్టు సాధించాలన్న పరిటాల కుటుంబం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి రాప్తాడు నుంచి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఆమె తనయుడు పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే అందుకు తగిన నియోజకవర్గం మాత్రం ఎంతకూ ఓకే కావడం లేదు.
ఈ విషయంలో పలు నియోజకవర్గాల పేర్లను పరిటాల కుటుంబం ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు వద్ద వీటి ప్రతిపాదనలు పెట్టారట. అయితే.. బాబు మాత్రం దేనికీ ఓకే చెప్పడం లేదు. ముందుగా అనంతపురం అర్బన్, ఆతరువాత పెనుకొండ, ఆ పై ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్ల మీద పరిటాల కుటుంబం కన్నేసింది. వాటిల్లో పోటీ చేస్తామంటూ లీకులు ఇచ్చి, ప్రయత్నాలు చేసింది. అయితే చంద్రబాబు నాయుడు అందుకు ఓకే చెప్పలేదు. ఆ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నందు వల్ల బాబు వారికి సమ్మతం తెలియజేయలేదు.

ఆ తర్వాత హిందూపురం ఎంపీ సీటు అంటూ లీకిచ్చారు. దాని పట్ల కూడా బాబు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో మరో నియోజకవర్గాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చిందట పరిటాల కుటుంబం. ఈ సారి వీరి కన్ను కల్యాణదుర్గం నియోజకవర్గం మీద పడింది. అక్కడ నుంచి పోటీ చేస్తామని చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారట.

అక్కడ కూడా ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేనే. అయితే ఆయనకు వయసు మీద పడింది. వచ్చేసారి పోటీ చేస్తాడో చేయడో.. అనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సీటును తమకు కేటాయించాలని పరిటాల కుటుంబం కోరుతోందని సమాచారం. మరి బాబు దీనికి ఏమంటాడో!

First Published:  30 Sep 2018 1:43 AM GMT
Next Story