Telugu Global
Cinema & Entertainment

సన్నీలియోన్‌కి కొత్త క‌ష్టాలు

సన్నీలియోన్‌ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ”వీర‌మహాదేవి” చిత్రంపై వివాదం రాజుకుంది. క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక స‌భ్యులు ఈ సినిమాను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. స‌న్నీ ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆ సినిమాలో న‌టించ‌కూడ‌ద‌ని క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక స్టేట్ సెక్ర‌ట‌రీ హ‌రీష్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎక్క‌డ ప‌ర్య‌టించినా తాము అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సన్నీలియోన్‌ వంటి వ్య‌క్తి వీర‌మ‌హాదేవి పాత్ర‌లో నటించ‌డం అంటే త‌మ సంస్కృతిపై దాడి చేసిన‌ట్లుగా తాము భావిస్తామ‌ని హ‌రీశ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విసి వ‌డివుడియ‌న్ […]

సన్నీలియోన్‌కి కొత్త క‌ష్టాలు
X

సన్నీలియోన్‌ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ”వీర‌మహాదేవి” చిత్రంపై వివాదం రాజుకుంది. క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక స‌భ్యులు ఈ సినిమాను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. స‌న్నీ ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆ సినిమాలో న‌టించ‌కూడ‌ద‌ని క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక స్టేట్ సెక్ర‌ట‌రీ హ‌రీష్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఎక్క‌డ ప‌ర్య‌టించినా తాము అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

సన్నీలియోన్‌ వంటి వ్య‌క్తి వీర‌మ‌హాదేవి పాత్ర‌లో నటించ‌డం అంటే త‌మ సంస్కృతిపై దాడి చేసిన‌ట్లుగా తాము భావిస్తామ‌ని హ‌రీశ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విసి వ‌డివుడియ‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న వీర‌మ‌హాదేవి చిత్రం 5 భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

న‌వంబ‌ర్ 3న అడ్డుకుంటాం

బెంగ‌ళూర్‌లో న‌వంబ‌ర్ 3న వైట్ ఆర్చిడ్ హోట‌ల్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో సన్నీలియోన్‌ డాన్స్ చేయ‌నుంది. 2017 డిసెంబ‌ర్ చివ‌రిలో జ‌ర‌గాల్సిన ఆ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. క‌ర‌వీ యువ‌సేన అప్ప‌ట్లో పెద్ద ర‌చ్చ చేసింది. స‌న్నీ లియోనీ దిష్టి బొమ్మ‌లు ద‌గ్ధం చేసింది. కార్య‌క్ర‌మం జ‌ర‌గాల్సిన చోట బీభ‌త్సం సృష్టించింది. దీంతో నిర్వాహ‌కులు కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఆ కార్య‌క్ర‌మం జ‌రిపేందుకు నిర్వాహ‌కులు సిద్ధ‌మౌతున్నారు. స‌న్నీడాన్సుల‌తో బెంగ‌ళూరు వాసుల‌ను అల‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గ‌తంలో జరిగిన విధంగానే ఈసారి కూడా నిర‌స‌న‌లు త‌ప్ప‌వ‌ని క‌ర‌వి యువ సేన హెచ్చ‌రించింది. కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డంలో త‌మ‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని… ఆ కార్య‌క్ర‌మంలో సన్నీలియోన్‌ ఉండ‌రాద‌ని తాము కోరుకుంటున్నామ‌ని యువ సేన నాయ‌కులు తెలిపారు.

First Published:  30 Sep 2018 12:51 AM GMT
Next Story