Telugu Global
NEWS

నేను పోటీ చేయను.... కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తా....

రాజకీయాల్లో హత్యలుండవు…. ఆత్మహత్యలే ఉంటాయంటారు…. అది నిజమే…. తెలంగాణ రాష్ట్ర సమితిలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా విజయశాంతి ఆ పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. కేసీఆర్ కు, విజయశాంతికి ఎక్కడ చెడిందో తెలియదు. ఆదిపత్య పోరులోనే విజయశాంతి బయటకు వెళ్లిందని కొందరు అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటే రాములమ్మ ఎక్కడో ఉండేవారు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ విజయశాంతి మాత్రం కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత […]

నేను పోటీ చేయను.... కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తా....
X

రాజకీయాల్లో హత్యలుండవు…. ఆత్మహత్యలే ఉంటాయంటారు…. అది నిజమే…. తెలంగాణ రాష్ట్ర సమితిలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నప్పుడు హఠాత్తుగా విజయశాంతి ఆ పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు.

కేసీఆర్ కు, విజయశాంతికి ఎక్కడ చెడిందో తెలియదు. ఆదిపత్య పోరులోనే విజయశాంతి బయటకు వెళ్లిందని కొందరు అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉంటే రాములమ్మ ఎక్కడో ఉండేవారు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ విజయశాంతి మాత్రం కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవందర్ రెడ్డి చేతిలో ఓడిపోయాక…. ఇక రాజకీయాల నుంచే దూరంగా జరిగారు. ఏమైందో ఏమో గానీ గడిచిన నాలుగున్నరేళ్లుగా విజయశాంతి పొలిటికల్ స్క్రీన్ మీద కనిపించలేదు.

ఈ మధ్యే విజయశాంతి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత తనకు కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అనే కొత్త పోస్టును సృష్టించి కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిని ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకాలని ఆదేశించింది.

తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి…. కేసీఆర్ టార్గెట్ గా పలు కామెంట్స్ చేశారు. కేసీఆర్ తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం చెప్పలేదని, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకే ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రలేదని కుండబద్దలు కొట్టారు.

అంతా బాగానే ఉన్నా రాములమ్మ వచ్చే ముందస్తు ఎన్నికల్లో మాత్రం పోటీచేయనని చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి ఈసారి పోటీచేయనని తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మెదక్ అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన విజయశాంతికి ఈసారి కూడా అదే టికెట్ ఇద్దామని పీసీసీ చీఫ్ భావించాడట. కానీ పద్మా దేవేందర్ రెడ్డిని ఓడించడం కష్టమని…. టీఆర్‌ఎస్‌ అక్కడ బలంగా ఉందని…. గెలవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. అందుకే విజయశాంతి ఈసారి పోటీచేయనని ప్రకటించిందని అంటున్నారు.

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని ధీమాగా చెబుతున్న రాములమ్మ…. తనే పోటీచేసి గెలవలేని స్థితిలో ఉన్నారా? అని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

First Published:  30 Sep 2018 11:35 AM GMT
Next Story