Telugu Global
Cinema & Entertainment

తమిళ సినిమా.. తెలుగులో ప్రకంపనలు

అదొక తమిళ సినిమా. ఇంకా చెప్పాలంటే అక్కడింకా విడుదల కాలేదు. ఆ సినిమాపై తమిళనాట అంతో ఇంతో ఆసక్తి ఉందంటే నమ్మొచ్చు. కానీ రిలీజ్ కు ముందే ఓ తమిళ సినిమాకు తెలుగులో ఎంతో బజ్ క్రియేట్ అయింది. అది కూడా సూపర్ స్టార్ నటించిన సినిమా కాదు. విజయ్ సేతుపతి-త్రిష కలిసి చేసిన ఆ సినిమా పేరు 96. ఇప్పుడీ సినిమా టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై దిల్ […]

తమిళ సినిమా.. తెలుగులో ప్రకంపనలు
X

అదొక తమిళ సినిమా. ఇంకా చెప్పాలంటే అక్కడింకా విడుదల కాలేదు. ఆ సినిమాపై తమిళనాట అంతో ఇంతో ఆసక్తి ఉందంటే నమ్మొచ్చు. కానీ రిలీజ్ కు ముందే ఓ తమిళ సినిమాకు తెలుగులో ఎంతో బజ్ క్రియేట్ అయింది. అది కూడా సూపర్ స్టార్ నటించిన సినిమా కాదు. విజయ్ సేతుపతి-త్రిష కలిసి చేసిన ఆ సినిమా పేరు 96.

ఇప్పుడీ సినిమా టాలీవుడ్ లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై దిల్ రాజు కన్నేయడమే. అవును.. 96 అనే సినిమా తెలుగు రీమేక్స్ రైట్స్ ను దిల్ రాజు తీసుకున్నారు. ఇంకా లీగల్ గా పేపర్ వర్క్ పూర్తికాలేదు కానీ, దాదాపు పనైపోయినట్టే. అయితే ఇప్పుడీ సినిమాను టాలీవుడ్ లో పలువురు ప్రముఖులకు దిల్ రాజు చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా ఇది హాట్ కేక్ అయిపోయింది.

నానితో కలిసి చెన్నై వెళ్లి మరీ 96 సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు దిల్ రాజు. రీసెంట్ గా బన్నీకి కూడా ఈ సినిమా చూపించారట. త్వరలోనే మరో ముగ్గురు హీరోలకు కూడా ఈ సినిమాను చూపించబోతున్నాడట. వీళ్లలో ఎవరు ఓకే చెబితే, వాళ్లతో 96 అనే సినిమా తెలుగు రీమేక్ స్టార్ట్ చేయాలనేది దిల్ రాజు ఆలోచన. ఒకవేళ దిల్ రాజు అనుకున్న హీరోలు అంగీకరించకపోయినా, మరో హీరోతో వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడు.

First Published:  1 Oct 2018 8:28 AM GMT
Next Story