Telugu Global
NEWS

పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాం.... కాంగ్రెస్‌ ప్రీ మేనిఫెస్టో

ఏపీలో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న కాంగ్రెస్‌ కోలుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. భారీ హామీలు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం ఉంటుందని వివరించారు. రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేని విధంగా జీఎస్టీని అమలులోకి తెస్తామన్నారు. పెట్రోల్‌ను జీఎస్టీ […]

పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాం.... కాంగ్రెస్‌ ప్రీ మేనిఫెస్టో
X

ఏపీలో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న కాంగ్రెస్‌ కోలుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. భారీ హామీలు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం ఉంటుందని వివరించారు. రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేని విధంగా జీఎస్టీని అమలులోకి తెస్తామన్నారు. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని వెల్లడించారు.

పేద కుటుంబానికి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించి షెడ్యూల్‌ -9లో చేరుస్తామని చెప్పారు. వంద రోజుల్లో ప్రభుత్వంలోని ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు.

First Published:  1 Oct 2018 12:33 AM GMT
Next Story