Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి బంధువు కిడ్నాప్... ?

ఓటుకు నోటు కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. సోమవారం రేవంత్ రెడ్డి వర్గం కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చింది. రేవంత్ రెడ్డి బంధువు రణదీప్‌ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపిస్తోంది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌ సింహ మీడియాతో ఈ విషయం చెప్పారు. ఆదివారం ఐటీ అధికారుల పేరుతో రణదీప్ రెడ్డి ఇంటిలో కొందరు సోదాలు నిర్వహించారని చెప్పారు. సోదాలకు వచ్చిన వారు రణదీప్‌ రెడ్డి కుటుంబసభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనంతరం ఇంట్లోని […]

రేవంత్ రెడ్డి బంధువు కిడ్నాప్... ?
X

ఓటుకు నోటు కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. సోమవారం రేవంత్ రెడ్డి వర్గం కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చింది. రేవంత్ రెడ్డి బంధువు రణదీప్‌ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపిస్తోంది.

రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌ సింహ మీడియాతో ఈ విషయం చెప్పారు. ఆదివారం ఐటీ అధికారుల పేరుతో రణదీప్ రెడ్డి ఇంటిలో కొందరు సోదాలు నిర్వహించారని చెప్పారు.

సోదాలకు వచ్చిన వారు రణదీప్‌ రెడ్డి కుటుంబసభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనంతరం ఇంట్లోని కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారం తీసుకుని దానితో పాటు రణదీప్‌ రెడ్డిని కూడా తీసుకెళ్లారని చెప్పారు.

అయితే తాను నేడు ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకాగా…. రణదీప్‌ రెడ్డి ఎవరో తమకు తెలియదని…. ఆయన ఇంటిపై దాడులు చేయలేదని చెప్పారన్నారు. ఇప్పటికీ రణదీప్‌ రెడ్డి ఆచూకీ తమకు తెలియడం లేదన్నారు.

ఐటీ అధికారులు కానప్పుడు మరెవరు ఇలా రణదీప్‌ రెడ్డి ఇంటిపై దాడులు చేశారో చెప్పాలన్నారు. రణదీప్ రెడ్డి కనిపించడం లేదంటూ ఆయన కుటుంబసభ్యులు ఎల్‌బీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడి సీఐ నవ్వుతూ తాము ఈ కేసు తీసుకోబోమన్నారని ఉదయ సింహ వివరించారు. ఐటీ అధికారుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వమే నకిలీ దాడులు చేయించిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అయితే నిజంగా రణదీప్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారా? లేకుంటే ఓటుకు నోటు బృందం ఇలా కొత్త కథ అల్లుతోందా? అన్నది తెలియడం లేదు.

First Published:  1 Oct 2018 2:51 AM GMT
Next Story