Telugu Global
NEWS

కాంగ్రెస్‌లో దున్నుకున్నోడికి దున్నుకున్నంత " బండ్ల గణేష్

2019లో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయిపోవడం ఖాయమన్నారు నిర్మాత, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు, వైఎస్ హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసి ఇస్తే మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల్లోకి తీసుకొచ్చారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. తనకు కాంగ్రెస్ సీటు ఇవ్వడం ఖాయమని…. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలుస్తానని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీని చంద్రబాబు అభివృద్ధి […]

కాంగ్రెస్‌లో దున్నుకున్నోడికి దున్నుకున్నంత  బండ్ల గణేష్
X

2019లో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయిపోవడం ఖాయమన్నారు నిర్మాత, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు, వైఎస్ హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసి ఇస్తే మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల్లోకి తీసుకొచ్చారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

తనకు కాంగ్రెస్ సీటు ఇవ్వడం ఖాయమని…. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలుస్తానని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని గణేష్ చెప్పారు. మరి మీ దేవుడు పవన్‌ కల్యాణ్… ఏపీని చంద్రబాబు అవినీతి అక్రమాలతో అదోగతిపాలు చేశారని చెబుతున్నారు కదా దానిపై ఏమంటారని ప్రశ్నించగా బండ్ల గణేష్‌ నీళ్లు నమిలారు.

చంద్రబాబు పాలనపై తనది వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పవన్‌ కల్యాణ్ మీద అభిమానం తన పర్సనల్ అని…. కాంగ్రెస్ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని అందుకే ఆ పార్టీలో చేరానన్నారు. పవన్‌ కల్యాణ్‌ గురించి అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనన్నారు బండ్ల గణేష్‌.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా జైలుకు వెళ్లారని…. తెలంగాణకు నై అన్న వారంతా పదవుల్లో ఉన్నారని విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు, దానం నాగేందర్‌, తలసానిలాంటి వారు మాత్రం టీఆర్‌ఎస్‌కు మంచి వాళ్లు అయ్యారా అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని…. తమది ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. కాంగ్రెస్‌లో దున్నుకున్నోడికి దున్నుకున్నంత అని వ్యాఖ్యానించారు.

కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా? సీల్డ్‌ కవర్‌ రాగానే ఆయన ముఖ్యమంత్రి అయిపోయారని అలాంటి ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌లో మాత్రమే ఉందన్నారు. ఇలాంటి స్వేచ్చ ప్రాంతీయ పార్టీల్లో సాధ్యమా అని ప్రశ్నించారు. సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

ఎమ్మెల్యే అవడానికి 30లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారని…. అమాయకంగా సమాధానం చెప్పారు బండ్ల గణేష్. డబ్బులు తీసుకుని వేసే ఓట్లు తనకు వద్దన్నారు. తనపై ఉన్న కేసులన్ని వైట్‌ కాలర్ నేరాలకు సంబంధించినవే అని వాటిని తాను భయపడడం లేదన్నారు.

First Published:  2 Oct 2018 10:01 AM GMT
Next Story