Telugu Global
Cinema & Entertainment

దేవదాస్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

నాగార్జున, నాని హీరోలుగా నటించిన దేవదాస్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లలో మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు స్టడీగా ఉన్నాయి. శైలజారెడ్డి అల్లుడు కూడా పడిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో దేవదాస్ దే హవా నడుస్తోంది. అలా సక్సెస్ ఫుల్ గా మొదటి వారంతం పూర్తిచేసుకున్న ఈ సినిమా, విడుదలైన ఈ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ […]

దేవదాస్ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు
X

నాగార్జున, నాని హీరోలుగా నటించిన దేవదాస్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లలో మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు స్టడీగా ఉన్నాయి. శైలజారెడ్డి అల్లుడు కూడా పడిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో దేవదాస్ దే హవా నడుస్తోంది. అలా సక్సెస్ ఫుల్ గా మొదటి వారంతం పూర్తిచేసుకున్న ఈ సినిమా, విడుదలైన ఈ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ రాబట్టింది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ (5 లక్షల డాలర్లు) మార్క్ క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దేవదాస్ సినిమాకు 16 కోట్ల 50 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ లో దేవదాస్ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 4.21 కోట్లు
సీడెడ్ – రూ. 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.60 కోట్లు
ఈస్ట్ – రూ. 0.84 కోట్లు
వెస్ట్ – రూ. 0.62 కోట్లు
గుంటూరు – రూ. 1.13 కోట్లు
కృష్ణా – రూ. 0.92 కోట్లు
నెల్లూరు – రూ. 0.43 కోట్లు

First Published:  1 Oct 2018 8:58 PM GMT
Next Story