Telugu Global
NEWS

టీడీపీ మీడియాపై పవన్ ఫైర్

ఇటీవల పవన్ కల్యాణ్ గోదావరి జిల్లా లక్ష్మీపురంలో తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయగా.. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి పవన్‌ కల్యాణ్ తెల్లవారుజామున రహస్యంగా పూజలు చేశారంటూ కథనం రాసింది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన జనసేన పోరాటయాత్ర సభలో పవన్‌ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆలయంలో పూజలు చేస్తే అది రహస్య పూజలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. టీడీపీ, దాని మీడియా తీరు చూస్తుంటే… చివరకు చిన్నపిల్లలు ఇచ్చే విరాళాలు తీసుకున్నా… ”చిన్నపిల్లల […]

టీడీపీ మీడియాపై పవన్ ఫైర్
X

ఇటీవల పవన్ కల్యాణ్ గోదావరి జిల్లా లక్ష్మీపురంలో తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయగా.. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి పవన్‌ కల్యాణ్ తెల్లవారుజామున రహస్యంగా పూజలు చేశారంటూ కథనం రాసింది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన జనసేన పోరాటయాత్ర సభలో పవన్‌ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

ఆలయంలో పూజలు చేస్తే అది రహస్య పూజలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. టీడీపీ, దాని మీడియా తీరు చూస్తుంటే… చివరకు చిన్నపిల్లలు ఇచ్చే విరాళాలు తీసుకున్నా… ”చిన్నపిల్లల దగ్గర నుంచి 13 రూపాయలు దోచుకున్న పవన్ కల్యాణ్” అంటూ స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారని మండిపడ్డారు. బుట్టాయిగూడెంలో ఏకంగా 400 ఎకరాలు కబ్జా అయితే దానిపై స్టింగ్ ఆపరేషన్ మాత్రం ఎవడూ చేయడం లేదన్నారు.

వేల కోట్లను అడ్డంగా దోచుకుంటున్నా దానిపై స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు మాత్రం ఎవడూ ముందుకు రావడం లేదన్నారు. తన వద్ద పత్రికలు, టీవీ చానళ్లు లేవన్నారు పవన్‌. కర్నాటకలో 30-40 సీట్లు వచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యారని పవన్ గుర్తు చేశారు. జనసేన కూడా కొత్త తరహా రాజకీయాన్ని సృష్టించి తీరుతుందన్నారు.

ఏపీలో 14వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని చెబుతున్న లోకేష్.. ఒకసారి జంగారెడ్డిగూడెం వచ్చి ఇక్కడి రోడ్ల పరిస్థితిని చూడాలని పవన్‌ హితవు పలికారు. టీడీపీ నేతలు, మంత్రులు తిరిగే మార్గాల్లో మాత్రమే రోడ్లు వేస్తున్నారని పవన్ ఆరోపించారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు టీడీపీ కార్యకర్తల తరహాలో వాడుకుంటున్నారని…. ఇది సరైన పద్దతి కాదన్నారు పవన్.

First Published:  2 Oct 2018 9:05 AM GMT
Next Story