Telugu Global
NEWS

టీడీపీ ఎంపీ టికెట్లకు అభ్యర్థుల కొరత ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ దాదాపు 12 లోక్ సభ నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని 25 ఎంపీ సీట్లలో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు. అప్పడే కేంద్రం వద్ద నుంచి తను దేన్నైనా సాధించుకురాగలనని చెప్పుకుంటున్నాడు. అయినా 18 సీట్లు గెలిపించినప్పుడే చంద్రబాబు నాయుడు ఏం సాధించలేకపోయాడు. పాతిక నెగ్గితే కానీ ఏం చేయలేనని ఇప్పుడు అంటున్నాడు. ఇలాంటి బాబును జనాలు ఏం నమ్ముతారో కానీ.. ఇప్పుడు బాబుకు […]

టీడీపీ ఎంపీ టికెట్లకు అభ్యర్థుల కొరత ?
X

ఏపీలో తెలుగుదేశం పార్టీ దాదాపు 12 లోక్ సభ నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని 25 ఎంపీ సీట్లలో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు. అప్పడే కేంద్రం వద్ద నుంచి తను దేన్నైనా సాధించుకురాగలనని చెప్పుకుంటున్నాడు. అయినా 18 సీట్లు గెలిపించినప్పుడే చంద్రబాబు నాయుడు ఏం సాధించలేకపోయాడు. పాతిక నెగ్గితే కానీ ఏం చేయలేనని ఇప్పుడు అంటున్నాడు. ఇలాంటి బాబును జనాలు ఏం నమ్ముతారో కానీ.. ఇప్పుడు బాబుకు ఎవరికి టికెట్లు ఇవ్వాలనే టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతానికి అయితే 12 సీట్లలో సిట్టింగులకే టికెట్లు ఇస్తానని బాబు అంటున్నాడట. వారిలో శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, అమలాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, హిందూపురం, కర్నూలు ఎంపీలున్నారు. పాతిక సీట్లలో 12 సీట్ల విషయంలో బాబుకు క్లారిటీ ఉందట. ఇక మిగిలిన 13 సీట్ల విషయంలో మాత్రం టీడీపీకి స్పష్టత లేదని స్పష్టం అవుతోంది.

కొంతమంది ఎంపీలు తాము మళ్లీ ఎంపీలుగా పోటీ చేయమని, ఎమ్మెల్యేలుగా వెళ్తామని అంటున్నారట. అయినప్పటికీ వారిలో కొందరికి సర్ధి చెప్పినా…. కొందరు మాత్రం ససేమిరా అంటున్నారని సమాచారం. దీంతో ఆ స్థానాల్లో వేరే అభ్యర్థులను తెచ్చుకోవాల్సి ఉంది చంద్రబాబు నాయుడు.

ఇక నెల్లూరు, ఒంగోలు సీట్ల విషయంలో అభ్యర్థులు దొరకడం కష్టం అవుతోందని సమాచారం. అలాగే కడప, రాజంపేట విషయంలో కూడా టీడీపీ టికెట్లకు అంత డిమాండ్‌ లేదు. ఇక కర్నూలు విషయంలో చివరకు ఫిరాయింపుదారుకే టికెట్ ఇవ్వాల్సి వస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టే అంశమే.

నంద్యాల ఎంపీ సీటు విషయంలో కూడా చంద్రబాబుకు స్పష్టత లేదని సమాచారం. టికెట్లు ఖరారు అయిన సిట్టింగుల్లో కూడా కొందరికి మళ్లీ పోటీ చేయడం ఇష్టం లేదని…. వీరిలో కొందరికి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోందని వార్తలు వస్తున్నాయి.

First Published:  3 Oct 2018 1:17 AM GMT
Next Story