Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ హోస్ట్ గా చేసినందుకు బాధపడుతున్న నాని

బిగ్ బాస్ 2 ని నాని హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎన్టీఆర్ ఏ బాగా చేసాడు… నాని ఎన్టీఆర్ ని దాటలేకపోతున్నాడు అనే విమర్శలు వచ్చాయి. అయితే రాను రాను ఆ విమర్శలు పోయి నాని మీద అసహ్యం పెంచుకున్నారు. కట్ చేస్తే అన్ని అంశాలు పక్కకు పోయి కౌశల్ ఆర్మీ దాడి నానిపై ఎక్కువగా పనిచేసింది. ఎక్కువ ఒత్తిడి అయ్యింది నానియే. ఒక దశలో కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నే శాసించే స్థాయికి […]

బిగ్ బాస్ హోస్ట్ గా చేసినందుకు బాధపడుతున్న నాని
X

బిగ్ బాస్ 2 ని నాని హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎన్టీఆర్ ఏ బాగా చేసాడు… నాని ఎన్టీఆర్ ని దాటలేకపోతున్నాడు అనే విమర్శలు వచ్చాయి. అయితే రాను రాను ఆ విమర్శలు పోయి నాని మీద అసహ్యం పెంచుకున్నారు. కట్ చేస్తే అన్ని అంశాలు పక్కకు పోయి కౌశల్ ఆర్మీ దాడి నానిపై ఎక్కువగా పనిచేసింది. ఎక్కువ ఒత్తిడి అయ్యింది నానియే.

ఒక దశలో కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నే శాసించే స్థాయికి రావడంతో నాని ఓ లెక్కా. షో జరిగినన్ని రోజులు నానిని ఒక రేంజ్ లో ఆడుకున్నారు ఆర్మీ వాళ్ళు. కౌశల్ ని టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ల లాగే నాని కూడా వ్యవహరించాడని అందుకే నాని ని టార్గెట్ చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారు కౌశల్ ఆర్మీ.

అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో ని హోస్ట్ చేసినందుకు నాని నిజంగానే బాగా ఫీల్ అవుతున్నాడట. అనవసరంగా ఆ షో ని ఒప్పుకొని తప్పు చేశాను అని నాని తన సన్నిహితుల దగ్గర ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది. బిగ్ బాస్ వల్ల నాని కి మంచి పేరు రాకపోగా విమర్శలు రావడమే కాకుండా కొంతమంది శత్రువులను సంపాదించుకున్నట్లు అయ్యిందని బాధపడుతున్నాడట నాని.

First Published:  3 Oct 2018 1:13 AM GMT
Next Story