Telugu Global
Cinema & Entertainment

నాగార్జున వ్యాఖ్యలపై స్పందించిన శ్రీ రామ్ ఆదిత్య

అక్కినేని నాగార్జున, నానిలు హీరోలుగా నటించిన సినిమా “దేవదాస్”. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య పై కొన్ని కామెంట్స్ చేసాడు. సినిమాని నాకు కొంచెం ముందుగా చూపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని కానీ శ్రీరామ్ ఆదిత్య నాకు సినిమా రెండు రోజుల ముందు చూపించాడు. తన తదుపరి సినిమా నుంచి ఈ ఒక్క విషయాన్నీ శ్రీరామ్ ఆదిత్య దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నాడు. అయితే […]

నాగార్జున వ్యాఖ్యలపై స్పందించిన శ్రీ రామ్ ఆదిత్య
X

అక్కినేని నాగార్జున, నానిలు హీరోలుగా నటించిన సినిమా “దేవదాస్”. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య పై కొన్ని కామెంట్స్ చేసాడు. సినిమాని నాకు కొంచెం ముందుగా చూపించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని కానీ శ్రీరామ్ ఆదిత్య నాకు సినిమా రెండు రోజుల ముందు చూపించాడు. తన తదుపరి సినిమా నుంచి ఈ ఒక్క విషయాన్నీ శ్రీరామ్ ఆదిత్య దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నాడు.

అయితే నాగార్జున చేసిన కామెంట్స్ పై స్పందించాడు శ్రీరామ్ ఆదిత్య. “దేవదాస్ సినిమా మొదట చూసి మెచ్చుకున్నది నాగార్జున గారే. ఇద్దరు హీరోలు ఒకేసారి తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఎంత సంతోషంగా ఉంటారో ఆన్ లోకేషన్ లో మాకు కూడా అంతే. నిర్మాణంతర కార్యక్రమాలకు నేను ఎక్కువ సమయం తీసుకుంటా.దాంతో నాగ్ సార్ కి ఆలస్యంగా చూపించా. అందుకే అయన నా గురించి అలా అన్నారు.

హాలీవుడ్ సినిమాలు చూసి అస్వాదిస్తానే కానీ, స్ఫూర్తి తీసుకోవడం ఉండదు. త్వరలో నా తదుపరి సినిమా గురించి చెబుతాను” అని చెప్పుకొచ్చాడు శ్రీ రామ్ ఆదిత్య. వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా ఆవరేజ్ టాక్ తో నడుస్తుంది.

First Published:  2 Oct 2018 9:23 PM GMT
Next Story