Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. దీనికి సంబంధించి “కింగ్ ఆఫ్ ది హిల్” పేరిట ఓ టీజర్ కూడా రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన నోటా పబ్లిక్ మీటింగ్ లో ఈ విషయాన్ని గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. హీరోగా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. గీతగోవిందం లో ఓ పాట పాడి సింగర్ గా కూడా మారాడు. అంతేకాదు, […]

నిర్మాతగా విజయ్ దేవరకొండ
X

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. దీనికి సంబంధించి “కింగ్ ఆఫ్ ది హిల్” పేరిట ఓ టీజర్ కూడా రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన నోటా పబ్లిక్ మీటింగ్ లో ఈ విషయాన్ని గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ.

హీరోగా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ హీరో. గీతగోవిందం లో ఓ పాట పాడి సింగర్ గా కూడా మారాడు. అంతేకాదు, తన టేస్ట్ కు తగ్గట్టు రౌడీ బ్రాండ్ తో దుస్తుల సిరీస్ కూడా ఏర్పాటుచేశాడు. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ కూడా లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

స్టుడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజాతో కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బయట నిర్మాతలకు మరో 2 సినిమాలు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత తన సొంత బ్యానర్ లో తనే హీరోగా సినిమా నిర్మించబోతున్నాడు విజయ్ దేవరకొండ.

First Published:  2 Oct 2018 9:30 PM GMT
Next Story