Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆకాశానికి ఎత్తేసిన సునీల్

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కి కెరీర్ మొదట్లో మంచి మంచి క్యారెక్టర్స్ రాసి సునీల్ ని ఇండస్ట్రీ లో నిలదోక్కుకునేలా చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సునీల్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు మనకి ఇప్పటికి గుర్తుంటాయి. కానీ సునీల్ హీరో అయ్యాక… త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కెరీర్ విషయం లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కాకపొతే సునీల్ ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. సునీల్ ని ఎలాగైనా మళ్ళి తిరిగి ఫార్మ్ లోకి […]

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఆకాశానికి ఎత్తేసిన సునీల్
X

కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కి కెరీర్ మొదట్లో మంచి మంచి క్యారెక్టర్స్ రాసి సునీల్ ని ఇండస్ట్రీ లో నిలదోక్కుకునేలా చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సునీల్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు మనకి ఇప్పటికి గుర్తుంటాయి. కానీ సునీల్ హీరో అయ్యాక… త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కెరీర్ విషయం లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కాకపొతే సునీల్ ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు.

సునీల్ ని ఎలాగైనా మళ్ళి తిరిగి ఫార్మ్ లోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కోసం తన సినిమా “అరవింద సమేత” లో ఒక మంచి పాత్ర రాసాడు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ త్రివిక్రమ్ గురించి చెప్తూ “చిన్నప్పుడు అమ్మా నాన్న తోడూ , బడికేల్లాక గురువులు విజ్ఞానం నేర్పుతారు. అన్నయ్యలు, పెద్దలు డబ్బులిచి బాగా చూస్తారు. అలా నాకు మూడు కలిపి ఇచ్చాడు త్రివిక్రమ్. హైదరాబాద్ వచ్చాక ఈ మూడు పోర్షన్స్ తీసుకున్న వ్యక్తి తను. జీవితంలో నువ్వు మంచి ఫ్రెండ్ ను సెలక్ట్ చేసుకుంటే చాలు దీమాగా ఉంటుంది. నేను అలా సెలక్ట్ చేసుకున్న వ్యక్తి త్రివిక్రమ్. ఇది చెప్పడం ఆనందాన్ని ఇస్తుంది. చాలా మంచి ఛాన్స్ వచ్చింది. ఎన్ని వేషాలు వేసినా ఫైనల్ గా నాకో మంచి వేషం రాయడానికి తానున్నాడని ధైర్యం” అంటూ ఎమోషనల్ అయ్యాడు సునీల్.

First Published:  4 Oct 2018 2:01 AM GMT
Next Story