Telugu Global
Cinema & Entertainment

వారం తిరక్కుండానే చతికిలపడ్డారు

దేవ, దాస్ కలిసి మేజిక్ చేశారంటూ మొన్నటివరకు అంతా ఊదరగొట్టారు. అన్ని సెంటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయంటూ పోస్టర్ల మీద పోస్టర్లు విడుదల చేశారు. కట్ చేస్తే వారం తిరిగేసరికి దేవదాస్ చతికిలపడ్డారు. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సాధారణ స్థాయిలో మాత్రమే వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో అస్సలు పోటీ లేని టైమ్ లో వచ్చిన దేవదాస్ సినిమా యావరేజ్ అనిపించుంది. అదే మరో గట్టి సినిమాతో పోటీపడి ఉంటే దేవదాస్ […]

వారం తిరక్కుండానే చతికిలపడ్డారు
X

దేవ, దాస్ కలిసి మేజిక్ చేశారంటూ మొన్నటివరకు అంతా ఊదరగొట్టారు. అన్ని సెంటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయంటూ పోస్టర్ల మీద పోస్టర్లు విడుదల చేశారు. కట్ చేస్తే వారం తిరిగేసరికి దేవదాస్ చతికిలపడ్డారు. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సాధారణ స్థాయిలో మాత్రమే వసూళ్లు వచ్చాయి.

థియేటర్లలో అస్సలు పోటీ లేని టైమ్ లో వచ్చిన దేవదాస్ సినిమా యావరేజ్ అనిపించుంది. అదే మరో గట్టి సినిమాతో పోటీపడి ఉంటే దేవదాస్ ఫ్లాప్ అయ్యేదని అంచనా వేస్తోంది ట్రేడ్. మొత్తమ్మీద ఈ వారం రోజుల్లో దేవదాస్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 15 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 6.08 కోట్లు
సీడెడ్ – రూ. 2.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
ఈస్ట్ – రూ. 1.07 కోట్లు
వెస్ట్ – రూ. 0.85 కోట్లు
గుంటూరు – రూ. 1.40 కోట్లు
కృష్ణా – రూ. 1.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.57 కోట్లు

First Published:  4 Oct 2018 3:18 AM GMT
Next Story