రిటైర్ మెంట్ ప్రకటించనున్న అనుష్క ?

స్టార్ హీరోయిన్ అనుష్క ఈ ఏడాది “భాగమతి” ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. పూర్తీ స్థాయి హారర్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యలేదు అనుష్క. గతంలో మాధవన్ సరసన ఒక సైలెంట్ థ్రిల్లర్ లో అనుష్క నటించడానికి ఒప్పుకుంది అనే రూమర్స్ వచ్చినా కూడా ఆ సినిమా ఇప్పటి వరకు పట్టాలేక్కలేదు. అలాగే గౌతం మీనన్ సినిమాలో కూడా అనుష్క నటిస్తుంది అనే టాక్ వచ్చింది. ఈ సినిమా తాలూకు డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు.

అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అనుష్క ఇక మీదట సినిమాలు ఏవి సైన్ చెయ్యకుండా సినిమాలకి రిటైర్ మెంట్ ప్రకటించే దిశగా ఆలోచిస్తుందట. రిటైర్ మెంట్ ఇవ్వాలి అని అనుకుంది కాబట్టే అనుష్క ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యలేదట. రిటైర్ అయ్యి హాయిగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో మిగిలిన జీవితాన్ని గడపాలి అనేది అనుష్క ప్లాన్. మరి ఈ విషయంలో నిజానిజాలు ఎన్ని ఉన్నాయి అని తెలియాలి అంటే అనుష్క నోరు విప్పాల్సిందే.