Telugu Global
NEWS

బాధ నీదా? తెలంగాణదా?

బాధ నీదా? తెలంగాణదా?….. అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ఏ సామాజిక వర్గం తెలంగాణను దోచేసిందో… తెలంగాణ భూములు వేల ఎకరాలను గుప్పెట్లో పెట్టుకుందో ఆ సామాజిక వర్గం ఆధిపత్యం నుంచి తెలంగాణను కేసీఆర్‌ రక్షిస్తాడు అనుకున్నారు తెలంగాణ వాదులు. అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చీ రాగానే రాజకీయ లెక్కలు వేశారు. తెలంగాణలో తమ ప్రత్యర్ధులు ఒక సామాజిక వర్గం కాబట్టి మరో సామాజిక వర్గాన్ని చేరదీశాడు. పదవులు ఇచ్చాడు. […]

బాధ నీదా? తెలంగాణదా?
X

బాధ నీదా? తెలంగాణదా?….. అని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ఏ సామాజిక వర్గం తెలంగాణను దోచేసిందో… తెలంగాణ భూములు వేల ఎకరాలను గుప్పెట్లో పెట్టుకుందో ఆ సామాజిక వర్గం ఆధిపత్యం నుంచి తెలంగాణను కేసీఆర్‌ రక్షిస్తాడు అనుకున్నారు తెలంగాణ వాదులు.

అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చీ రాగానే రాజకీయ లెక్కలు వేశారు. తెలంగాణలో తమ ప్రత్యర్ధులు ఒక సామాజిక వర్గం కాబట్టి మరో సామాజిక వర్గాన్ని చేరదీశాడు. పదవులు ఇచ్చాడు. లక్షనాగళ్ళతో దున్నుతానన్న భూమి ఆసామి దగ్గరకు వెళ్ళి ప్రణమిల్లాడు.

ఓటుకు నోటు కేసుతో సహా…. నయీమ్‌ కేసులోనూ, డ్రగ్స్‌ కేసులోనూ అడ్డంగా దొరికన ఆ సామాజిక వర్గ వ్యక్తులను పదిలంగా కాపాడుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ వెళ్ళి కొందరు సమాదుల వద్ద మోకరిల్లాడు. అప్పుడంతా గుర్తురాని వాళ్ళు తెలంగాణను చేసిన మోసం, చంద్రబాబు తెలంగాణకు చేసిన ద్రోహం, టీడీపీ తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయం కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి…. కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నట్టు…. ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం బాధ…. తెలంగాణ ప్రజల బాధలాగా…. గొంతుచించుకుంటున్నాడు కేసీఆర్‌.

చంద్రబాబు ఇప్పుడే కొత్తగా తెలంగాణకు ద్రోహం చేశాడా? ఈ నాలుగేళ్ళు కేసీఆర్‌ నిద్రపోతున్నాడా? ఓటుకునోటు కేసులో చంద్రబాబును, ఇతర కేసుల్లో చంద్రబాబు తాలూకు వాళ్ళను రక్షించింది కేసీఆర్‌ కాదా? ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కలిసే సరికి…. నీ సీటు కిందకు నీళ్ళు వచ్చేసరికి…. ఇప్పుడు ఆయనను తెలంగాణ శత్రువుగా ప్రచారం చేస్తున్న మీరు ఈ నాలుగేళ్ళు మీ భుజాలమీద ఎందుకు మోశారు? మీరు ముద్దొచ్చి చంకనెక్కించుకున్నంత కాలం ప్రజలు కూడా ఆయనను ప్రేమించాలా? మీకు శత్రువు కాగానే ప్రజలు ద్వేషించాలా?….. ఇదేం న్యాయం కేసీఆర్‌ అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు కేంద్రానికి 36 లేఖలు రాశారని చెబుతున్నావు. అవి కాంగ్రెస్‌తో ఒప్పందం తరువాతే రాశాడా? తెలంగాణ ఏడు మండలాలను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాకే ఆంధ్రాలో కలిపేసుకున్నాడా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడని నువ్వే చెబుతున్నా…. చంద్రబాబును ఇంతకాలం రక్షించింది ఎవరు? మీరు కాదా?అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

First Published:  4 Oct 2018 2:17 AM GMT
Next Story