అరంగేట్రం టెస్టులోనే సెంచరీ హీరో పృథ్వీ షా

  • రాజ్ కోట టెస్టు తొలిరోజునే పృథ్వీ షా షో
  • 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్ట్ శతకం
  • 99 బాల్స్ లోనే 15 బౌండ్రీలతో పృథ్వీ శతకం

టీమిండియా యువ ఓపెనర్ పృథ్పీ షా…అరంగేట్రం టెస్ట్ లోనే అదరగొట్టాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్ట్ క్యాప్ అందుకోడమే కాదు…తన మొట్టమొదటి టెస్ట్ ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించిన…భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. 

2017లో రాజ్ కోట్ స్టేడియం వేదికగానే తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన పృథ్వీ షా…తొలిటెస్ట్ మ్యాచ్ ను సైతం అదే వేదికలో ఆడటం విశేషం. సీనియర్ ఓపెనర్ కెఎల్ రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా మొదటి 50 పరుగులను కేవలం 56 బాల్స్ లోనే 7 బౌండ్రీలతో సాధించాడు.

వన్ డౌన్ చతేశ్వర్ పూజారాతో కలసి రెండో వికెట్ కు 164 బాల్స్ లో150 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

 అంతేకాదు…అరంగేట్రం టెస్టులోనే కేవలం 99 బాల్స్ లోనే 15 బౌండ్రీలతో…సెంచరీ సాధించి … వారేవ్వా అనిపించుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో…అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన 15వ భారత క్రికెటర్ గా…ఏడవ అతిపిన్నవయస్కుడైన క్రికెటర్ గా పృథ్వీ షా రికార్డుల్లో చేరాడు.