Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమా తో నా సినిమాకి పోటీ ఏంటండి " విజయ్ దేవరకొండ

స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” అక్టోబర్ 11న దసరా సంధర్బంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కి కరెక్ట్ గా వారం ముందు అంటే అక్టోబర్ 5 న “నోటా” సినిమాతో వస్తున్నాడు విజయ్. అయితే చాలా మంది ఎన్టీఆర్ కి విజయ్ కి మధ్య బాక్స్ ఆఫీస్ పోరు స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఈ కామెంట్స్ పై విజయ్ సీరియస్ గా స్పందించాడు. నా సినిమా బిజినెస్ ముందు […]

ఎన్టీఆర్ సినిమా తో నా సినిమాకి పోటీ ఏంటండి  విజయ్ దేవరకొండ
X

స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” అక్టోబర్ 11న దసరా సంధర్బంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కి కరెక్ట్ గా వారం ముందు అంటే అక్టోబర్ 5 న “నోటా” సినిమాతో వస్తున్నాడు విజయ్. అయితే చాలా మంది ఎన్టీఆర్ కి విజయ్ కి మధ్య బాక్స్ ఆఫీస్ పోరు స్టార్ట్ అవుతుంది అని అన్నారు.

ఈ కామెంట్స్ పై విజయ్ సీరియస్ గా స్పందించాడు. నా సినిమా బిజినెస్ ముందు చూసుకుంటే ఎన్టీఆర్ సినిమా బిజినెస్ పది రేట్లు ఎక్కువ ఉంటుంది. అలాంటిది నా సినిమా ఎన్టీఆర్ సినిమాకి ఎలా పోటీ అవుతుంది. పైగా ఎన్టీఆర్ సినిమాకి వారం ముందు నా సినిమా రిలీజ్ చేస్తే ఇంకా నా సినిమాకే నష్టం కదా. అలాంటప్పుడే కొంత మంది నాతో నా సినిమా రిలీస్ ని పోస్ట్ పోన్ చేసుకోమని అన్నారు కానీ నా సినిమా పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పే హక్కు వారికి లేదు. నా సినిమా ఎప్పుడు రిలీస్ చేయాలో నాకు బాగా తెలుసు అంటూ చెప్పకొచ్చాడు విజయ్ దేవరకొండ.

మరి ఈ ఏడాది “గీత గోవిందం” తో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ ఆ సక్సెస్ ని “నోటా” తో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

First Published:  3 Oct 2018 9:54 PM GMT
Next Story