Telugu Global
National

కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న.... మోడీ.... షాకింగ్ నిజం....

ప్రధాని నరేంద్రమోడీ.. గడిచిన 2014 ఎన్నికల్లో ఒంటిచేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. దేశమంతా తిరిగి కమలదళాన్ని అధికార అందలమెక్కించాడు. ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చి బీజేపీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ అంటే ఆది నుంచి ద్వేషమే.. అలాంటి మోడీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడమేంటని ఆలోచిస్తున్నారా.? కానీ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం లేదు. నరేంద్ర మోడీని అచ్చుగుద్దినట్టు పోలి ఉండే అభినందన్ పాఠక్ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. […]

కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న.... మోడీ.... షాకింగ్ నిజం....
X

ప్రధాని నరేంద్రమోడీ.. గడిచిన 2014 ఎన్నికల్లో ఒంటిచేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. దేశమంతా తిరిగి కమలదళాన్ని అధికార అందలమెక్కించాడు. ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చి బీజేపీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ అంటే ఆది నుంచి ద్వేషమే.. అలాంటి మోడీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడమేంటని ఆలోచిస్తున్నారా.? కానీ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం లేదు.

నరేంద్ర మోడీని అచ్చుగుద్దినట్టు పోలి ఉండే అభినందన్ పాఠక్ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని తాజాగా నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ కు చెందిన అభినందన్ పాఠక్ గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందట. మరికొందరు కోపంతో ఉన్నారట.. ఈయనను నిలదీశారట.. అందుకే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు మోడీ వేషధారణతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి పూనుకున్నారు..

అభినందన్ తాజాగా యూపీలో మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్రమోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని.. వాస్తవానికి ఆయన ఏమనుకుంటున్నారో తెలియడం లేదని ’ వాపోయాడు. జనంలోకి ఎక్కడికి వెళ్లినా మంచి రోజులు ఎప్పుడొస్తాయ్ అని అడుగుతున్నారని.. నేను చాలా సార్లు ప్రజల నుంచి తిట్లు తిన్నానని వివరించాడు. మళ్లీ ఆ తప్పు చేయవద్దనే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నానని వివరించాడు. త్వరలోనే సోనియాగాంధీతో సమావేశం కానున్నానని తెలిపారు.

First Published:  5 Oct 2018 5:45 AM GMT
Next Story