Telugu Global
Cinema & Entertainment

యాత్రలో జగన్ కు చోటు లేదు

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో వైఎస్ఆర్ తనయుడు జగన్ పాత్ర కోసం చాలా చర్చ జరిగింది. ఒక దశలో సూర్య ఇందులో నటించబోతున్నాడనే ప్రచారం కూడా సాగింది అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. యాత్ర […]

యాత్రలో జగన్ కు చోటు లేదు
X

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో వైఎస్ఆర్ తనయుడు జగన్ పాత్ర కోసం చాలా చర్చ జరిగింది. ఒక దశలో సూర్య ఇందులో నటించబోతున్నాడనే ప్రచారం కూడా సాగింది

అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. యాత్ర సినిమా నుంచి ఏకంగా వైఎస్ జగన్ పాత్రనే తొలిగించినట్టు టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మెయిన్ స్టోరీ నుంచి పక్కకు తొలగడం ఇష్టంలేక జగన్ పోర్షన్ ను దర్శకుడు మహి వి రాఘవ్ తొలిగించాడని చెబుతున్నారు. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

ఏదేమైనా, యాత్ర మూవీ నుంచి వైఎస్ జగన్ పోర్షన్ ను తొలిగించడానికే మేకర్స్ ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 21న యాత్ర సినిమా థియేటర్లలోకి రానుంది.

First Published:  5 Oct 2018 5:05 AM GMT
Next Story