Telugu Global
Cinema & Entertainment

"నోటా" రిజెక్ట్ చేసి ఆ హీరో మంచి పనిచేసాడా ?

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “నోటా”. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కొంచెం నెగటివ్ టాక్ తో నడుస్తుంది. అయితే అసలు ఈ సినిమా అల్లు అర్జున్ కోసం ప్లాన్ చేశారు. అతడితో సినిమా చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నాలు చేసాడు. అయితే దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో నాకు ఈ కథ సూట్ కాదని డైరెక్టర్ కి మొహం మీదే చెప్పేసాడట అల్లు […]

నోటా రిజెక్ట్ చేసి ఆ హీరో మంచి పనిచేసాడా ?
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “నోటా”. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కొంచెం నెగటివ్ టాక్ తో నడుస్తుంది. అయితే అసలు ఈ సినిమా అల్లు అర్జున్ కోసం ప్లాన్ చేశారు. అతడితో సినిమా చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నాలు చేసాడు. అయితే దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో నాకు ఈ కథ సూట్ కాదని డైరెక్టర్ కి మొహం మీదే చెప్పేసాడట అల్లు అర్జున్.

ఇక ఆప్షన్ లేక ఆనంద్ శంకర్ అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్లి కథ ఓకే చేయించుకున్నాడు. జ్ఞానవేల్ రాజా పంపించిన దర్శకుడు ఆనంద్ శంకర విజయ్ కి కధ చెప్పాడు. ఆనంద్ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చేసాడు విజయ్. కట్ చేస్తే గ్రాండ్ గా రిలీజ్ అయిన “నోటా” ఎక్కడ చూసిన ఫ్లాప్ టాక్ తో రన్ అవుతుంది. కొంత మంది అయితే అల్లు అర్జున్ ఈ కథ రిజెక్ట్ చేసి చాలా మంచి చేసాడు అని అంటున్నారు.

First Published:  6 Oct 2018 2:22 AM GMT
Next Story