Telugu Global
Cinema & Entertainment

మరోసారి చేతులు కాల్చుకున్న మారుతి

కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు మారుతి. మరికొన్ని సినిమాలకు కథలు, కాన్సెప్టులు అందిస్తున్నాడు. ఇంకొన్ని సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుంటాడు. అయితే ఈమధ్య కాలంలో మారుతి చేసిన అలాంటి ప్రయోగాలన్నీ వికటించాయి. తాజాగా మరోసారి చేతులు కాల్చుకున్నాడు ఈ దర్శకుడు. భలే మంచి చౌకబేరమ్.. ఓ చిన్ని సినిమా ఇది. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. మారుతి బ్రాండ్ తో వసూళ్లు రాబట్టుకుందామని చూసిన మేకర్స్ కు […]

మరోసారి చేతులు కాల్చుకున్న మారుతి
X

కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు మారుతి. మరికొన్ని సినిమాలకు కథలు, కాన్సెప్టులు అందిస్తున్నాడు. ఇంకొన్ని సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుంటాడు. అయితే ఈమధ్య కాలంలో మారుతి చేసిన అలాంటి ప్రయోగాలన్నీ వికటించాయి. తాజాగా మరోసారి చేతులు కాల్చుకున్నాడు ఈ దర్శకుడు.

భలే మంచి చౌకబేరమ్.. ఓ చిన్ని సినిమా ఇది. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. మారుతి బ్రాండ్ తో వసూళ్లు రాబట్టుకుందామని చూసిన మేకర్స్ కు మొదటి రోజు మొదటి ఆటకే చుక్కలు కనిపించాయి. దీంతో మారుతి బ్రాండ్ ఇమేజ్ మరింత దిగజారినట్టయింది.

నిజానికి తను ఇకపై ఇలాంటి ప్రయోగాలు చేయనని మారుతి ఇప్పటికే ప్రకటించాడు. శైలజారెడ్డి అల్లుడు సినిమా టైమ్ లోనే వీటిపై క్లారిటీ ఇచ్చాడు. కానీ అప్పటికే భలే మంచి చౌకబేరమ్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాపై మారుతికి ఎలాంటి ఆశలు, అంచనాలు లేవు. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య, అప్పటికే రాసుకున్న అగ్రిమెంట్ కారణంగా ప్రచారం చేసి పెట్టాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం.

గతంలో మారుతి బ్రాండ్ తో వచ్చిన బ్రాండ్ బాబు అనే సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు భలే మంచి చౌకబేరమ్ అనే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ముందు చతికిలపడింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇకనైనా మారుతి ఇలాంటి సమర్పించుకోవడాలు ఆపుకుంటే మంచిదేమో.

First Published:  5 Oct 2018 8:05 PM GMT
Next Story