Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా కోసం 1.75 కోట్లు తీసుకున్న కాజల్

స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి పదేళ్ళకి పైగా అవుతున్నా కూడా ఇంకా క్రేజ్ తగ్గలేదు. గత ఏడాది మెగా స్టార్ చిరంజీవి సరసన “ఖైది నెంబర్ 150” నటించింది కాజల్.  అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతుంది. కానీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. […]

ఆ సినిమా కోసం 1.75 కోట్లు తీసుకున్న కాజల్
X

స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి వచ్చి పదేళ్ళకి పైగా అవుతున్నా కూడా ఇంకా క్రేజ్ తగ్గలేదు. గత ఏడాది మెగా స్టార్ చిరంజీవి సరసన “ఖైది నెంబర్ 150” నటించింది కాజల్. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతుంది.

కానీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఆ హీరోకి మార్కెట్ ఎలాగో లేదు కనీసం తన రెమ్యునరేషన్ అయిన గట్టిగా ముడితే చాలు అని కాజల్ అగర్వాల్ అనుకుంది కావొచ్చు. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి కాజల్ అగర్వాల్ వల్లే బిజినెస్ అవుతుంది అని భావించి కాజల్ అగర్వాల్ అడిగినంత ఇచ్చేసారు. తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

First Published:  6 Oct 2018 1:25 AM GMT
Next Story