Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి అనుకున్న నటులు దొరికేనా?

“బాహుబలి” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఎస్.ఎస్ రాజమౌళి ఒక భారి మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అందరి నోటా ఇదే మాట. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన కాస్టింగ్ పనిని స్టార్ట్ చేసాడు రాజమౌళి. […]

రాజమౌళి అనుకున్న నటులు దొరికేనా?
X

“బాహుబలి” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఎస్.ఎస్ రాజమౌళి ఒక భారి మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అందరి నోటా ఇదే మాట. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన కాస్టింగ్ పనిని స్టార్ట్ చేసాడు రాజమౌళి. తన కథకి తగ్గ నటీనటుల్ని వెతికే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఒక్కసారి ఈ పనులు పూర్తీ అవ్వగానే షూటింగ్ స్టార్ట్ చేస్తాడు రాజమౌళి. ఈ సినిమాకి కథని విజయేంద్ర ప్రసాద్ అందించాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పై డి.వి.వి దానయ్య ప్రొడ్యూస్ చేయనున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్ళు తమ సినిమాల నుంచి ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  6 Oct 2018 1:10 AM GMT
Next Story