Telugu Global
Cinema & Entertainment

అప్పటి లీకులపై ఇప్పుడు స్పందించాడు

గీతగోవిందం సినిమా లీక్ అయినప్పుడు ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి అలా లీకుల మధ్యే విడుదలై సూపర్ హిట్ అయింది ఆ సినిమా. మళ్లీ ఇన్నాళ్లకు అప్పటి లీకుల వ్యవహారంపై స్పందించాడు హీరో విజయ్ దేవరకొండ. ఈసారి లీకులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటపెట్టాడు. “ఆ టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. నిజానికి అందరూ అనుకుంటున్నట్టు గీతగోవిందం సినిమా కొన్ని పార్టులుగా లీక్ అవ్వలేదు. మొత్తం సినిమానే లీక్ అయిపోయింది. ఎంత అంటే, […]

అప్పటి లీకులపై ఇప్పుడు స్పందించాడు
X

గీతగోవిందం సినిమా లీక్ అయినప్పుడు ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి అలా లీకుల మధ్యే విడుదలై సూపర్ హిట్ అయింది ఆ సినిమా. మళ్లీ ఇన్నాళ్లకు అప్పటి లీకుల వ్యవహారంపై స్పందించాడు హీరో విజయ్ దేవరకొండ. ఈసారి లీకులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటపెట్టాడు.

“ఆ టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డాను. నిజానికి అందరూ అనుకుంటున్నట్టు గీతగోవిందం సినిమా కొన్ని పార్టులుగా లీక్ అవ్వలేదు. మొత్తం సినిమానే లీక్ అయిపోయింది. ఎంత అంటే, ఎడిటెడ్ వెర్షన్ 2 గంటల 15 నిమిషాలుంటే.. ఎడిటింగ్ చేయని సినిమా 2 గంటల 35 నిమిషాలు బయటకు వెళ్లిపోయింది. ఆ టైమ్ లో చాలా టెన్షన్ పడ్డాను. పెద్ద బ్యానర్ కాబట్టి బాగా హ్యాండిల్ చేశారు.”

ఇలా సినిమా మొత్తం లీక్ అయిందనే విషయాన్ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు.. త్వరలోనే విడుదలకు సిద్ధమైన టాక్సీవాలా లీకులపై కూడా స్పందించాడు.

“గీతగోవిందం సినిమాతో పాటు టాక్సీవాలా సినిమా కూడా మొత్తం లీక్ అయింది. అది కూడా అంతే. అప్పటివరకు ఎడిట్ అయిన సినిమా మొత్తం, కట్ చేసిన సన్నివేశాలతో పాటు లీక్ అయింది. కాకపోతే మా లక్కీ ఏంటంటే… దాన్ని వెంటనే ఆపగలిగాం. ఫుల్ మూవీ నెట్ లో అప్ లోడ్ కాలేదు. కొన్ని సీన్లు మాత్రం అక్కడక్కడ వచ్చాయి. వాటిని వెంటనే తీసేశాం.”

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తనకు సంబంధించిన రెండు సినిమాలు ఇలా ఒకేసారి లీక్ అవ్వడంతో చాలా నిరాశచెందానని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తన కెరీర్ కు సంబంధించి ఇప్పటివరకు తను చాలా బాధపడిన సందర్భం అదేనని అంటున్నాడు ఈ హీరో.

First Published:  5 Oct 2018 8:21 PM GMT
Next Story