Telugu Global
Cinema & Entertainment

నోటాకు కత్తిరింపులు తప్పలేదు

సినిమా హిట్ అయితే వారం, పది రోజుల తర్వాత ఎక్స్ ట్రా సీన్లు జత చేస్తుంటారు. దీని వల్ల రిపీట్ ఆడియన్స్ పెరుగుతారనేది మేకర్స్ నమ్మకం. దీనికే రివర్స్ లో మరో ఫార్మాట్ కూడా ఉంది. సినిమా ఫ్లాట్ అయితే కొన్ని సన్నివేశాల్ని కత్తిరిస్తారు. దీని వల్ల సినిమా ఇంకాస్త మెరుగుపడుతుందని, జనాలు వస్తారని మేకర్స్ ఆశ. ఈ రెండు ఫార్ములాలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. తాజాగా నోటాకు ఇందులో రెండో ఫార్ములాను ఫాలో అయ్యారు. […]

నోటాకు కత్తిరింపులు తప్పలేదు
X

సినిమా హిట్ అయితే వారం, పది రోజుల తర్వాత ఎక్స్ ట్రా సీన్లు జత చేస్తుంటారు. దీని వల్ల రిపీట్ ఆడియన్స్ పెరుగుతారనేది మేకర్స్ నమ్మకం. దీనికే రివర్స్ లో మరో ఫార్మాట్ కూడా ఉంది. సినిమా ఫ్లాట్ అయితే కొన్ని సన్నివేశాల్ని కత్తిరిస్తారు. దీని వల్ల సినిమా ఇంకాస్త మెరుగుపడుతుందని, జనాలు వస్తారని మేకర్స్ ఆశ. ఈ రెండు ఫార్ములాలు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. తాజాగా నోటాకు ఇందులో రెండో ఫార్ములాను ఫాలో అయ్యారు.

అవును.. ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న నోటాకు కత్తిరింపులు షురూ చేశారు. సెకెండాఫ్ లో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్న 2 భారీ ఎపిసోడ్లను తగ్గించారు. దీనివల్ల రన్ టైం దాదాపు 11 నిమిషాలు తగ్గిపోయింది. ఈ సెల్ఫ్-సెన్సార్ వల్ల ఆడియన్స్ పెరుగుతారని యూనిట్ భావిస్తోంది.

కానీ నోటా సినిమాకు ఇప్పటికే నెగెటివ్ టాక్ వచ్చేసింది. సినిమా అస్సలు బాగాలేదంటున్నారు చాలామంది. ఇలాంటి టైమ్ లో ఎన్ని కత్తిరింపులు చేసినా లాభం లేదు. టాక్ కు తగ్గట్టే శనివారం నోటాకు ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఓ కొత్త సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో సగటున 55శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. కానీ నోటా 40శాతం మించలేదు. శనివారమే పరిస్థితి ఇలా ఉంటే, సోమవారం నుంచి నోటా పరిస్థితి ఏంటో?

First Published:  7 Oct 2018 5:00 AM GMT
Next Story