Telugu Global
NEWS

అమావాస్య రోజున పోలింగ్‌.... కేసీఆర్‌ కి క‌లిసివ‌చ్చేనా?

తెలంగాణ ఎన్నిక‌ల తేదీలు వ‌చ్చేశాయి. డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌ల ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత స‌రిగ్గా మూడు నెల‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. సెప్టెంబ‌ర్ 6న కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. ఆనాడే త‌న లక్కీ నెంబ‌ర్ 6 క‌లిసివ‌చ్చేలా (1+0+5=6) 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఎన్నిక‌ల తేదీలు కూడా ఆయ‌న ల‌క్కీనెంబ‌ర్‌6 నాడే ప్ర‌క‌టించారు. కానీ పోలింగ్ మాత్రం ఆయ‌న ల‌క్కీ నెంబ‌ర్ నాడు జ‌ర‌గ‌డం లేదు. సరిగ్గా అమావాస్య రోజు పోలింగ్ […]

అమావాస్య రోజున పోలింగ్‌.... కేసీఆర్‌ కి క‌లిసివ‌చ్చేనా?
X

తెలంగాణ ఎన్నిక‌ల తేదీలు వ‌చ్చేశాయి. డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌ల ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత స‌రిగ్గా మూడు నెల‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. సెప్టెంబ‌ర్ 6న కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేశారు. ఆనాడే త‌న లక్కీ నెంబ‌ర్ 6 క‌లిసివ‌చ్చేలా (1+0+5=6) 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.

ఇప్పుడు ఎన్నిక‌ల తేదీలు కూడా ఆయ‌న ల‌క్కీనెంబ‌ర్‌6 నాడే ప్ర‌క‌టించారు. కానీ పోలింగ్ మాత్రం ఆయ‌న ల‌క్కీ నెంబ‌ర్ నాడు జ‌ర‌గ‌డం లేదు. సరిగ్గా అమావాస్య రోజు పోలింగ్ డిసైడ్ చేసింది.

సెంటిమెంట్లు, ముహూర్తాలు ప‌క్క‌గా ఫాలో అయ్యే కేసీఆర్‌కి ఈ విష‌యంలో మాత్రం కొంచెం ఝ‌ల‌క్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీల్లో ఎక్కడా కేసీఆర్ ల‌క్కీనెంబ‌ర్‌6 లేదు. ఆరో తేదీన కాకుండా ఏడో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అమావాస్య రోజు పోలింగ్‌…. 11న ఫ‌లితాలు వెలువ‌డ‌బోతున్నాయి.

ఈ రెండు రోజులు అంత మంచిగా లేవ‌నేది పురోహితుల అభిప్రాయం. అష్ట‌మ ఘ‌డియల్లో పోలింగ్ జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలు కేసీఆర్‌కు కలిసివస్తాయా? లేదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

మొత్తానికి డిసెంబ‌ర్7న ఎన్నిక‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్ కంటే ఇప్పుడు ఎక్కువ‌గా నెటిజ‌న్లు, ప్ర‌త్య‌ర్థి పార్టీల వారే ఆయ‌న ముహూర్తాలు చూస్తున్నారు. ల‌క్కీ నెంబ‌ర్లు క‌లిసిరావ‌డం లేద‌ని లెక్క‌లు వేస్తున్నారు.

First Published:  7 Oct 2018 12:16 AM GMT
Next Story