Telugu Global
NEWS

వాళ్ళనే తిడితే ఎలా? మమ్మల్ని కూడా తిట్టు

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ…. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటోంది. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ను లైట్ తీసుకుంటున్నారు. ఎందుకు ఏమీటో తెలియదు కానీ.. కాంగ్రెస్ ను తక్కువ తిడుతూ.. టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును చెడుగుడు ఆడేస్తున్నాడు. ఇప్పుడీ కొత్త వ్యూహం ఏంటో తెలియక కాంగ్రెస్ నేతలు తికమకపడుతున్నారట. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఇప్పడు నయా ట్రెండ్ నడుస్తోంది. విమర్శలను మిక్స్ చేస్తూ తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఆశీర్వాద […]

వాళ్ళనే తిడితే ఎలా? మమ్మల్ని కూడా తిట్టు
X

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ…. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటోంది. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ను లైట్ తీసుకుంటున్నారు. ఎందుకు ఏమీటో తెలియదు కానీ.. కాంగ్రెస్ ను తక్కువ తిడుతూ.. టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును చెడుగుడు ఆడేస్తున్నాడు. ఇప్పుడీ కొత్త వ్యూహం ఏంటో తెలియక కాంగ్రెస్ నేతలు తికమకపడుతున్నారట.

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఇప్పడు నయా ట్రెండ్ నడుస్తోంది. విమర్శలను మిక్స్ చేస్తూ తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఆశీర్వాద సభల్లో కేసీఆర్ బండ బూతులు తిడుతుంటే.. దానికి కొనసాగింపుగా తాజాగా ఏపీ టీడీపీ మంత్రులు, నేతలు అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, రేవంత్ కూడా సమాధానమిస్తున్నారు. మీడియా కూడా ఇప్పుడు ఈ తిట్ల దండకాన్నే బాగా హైలైట్ చేస్తోంది. తిట్టే టాలెంట్ లేకపోతే ప్రచారానికి అనర్హుడే అన్న రీతిలో తయారైంది తెలంగాణలో ప్రచార పరిస్థితి.

ముందస్తు ఎన్నికల వేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రచారం కూడా నిర్వహించేస్తున్నారు ఇరు పార్టీల నేతలు. వట్టి విమర్శలు చేస్తే జనాల్లో స్పందన రావడం లేదు. అది సరిపోవడం లేదు. అందుకే, ప్రజలు కూడా ఆసక్తిగా చర్చించుకోవడంలేదని నాయకులు కొత్త ఎత్తుగడగా తిట్లను ఎంచుకున్నారు. తిడితే ఫోకస్ అవుతామని ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా కోరుకోవడం ఇక్కడ కొసమెరుపు.

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ఆంధ్ర వరకే పరిమితమవలేదు. టీ టీడీపీగా మహా కూటమితో జత కట్టింది. కాంగ్రెస్సే మిగతా పార్టీలకు టిక్కెట్ల కేటాయింపు బాధ్యతను భుజాన వేసుకుంది. ఆ మేరకు టీడీపీకి వచ్చేవి 10 నుంచి 15 సీట్ల లోపే. కానీ, కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును తెగ తిట్టిపోశారు. ఇది కాంగ్రెస్ లీడర్లకు నచ్చలేదు. జాతీయ పార్టీ అయిన తమను తిట్టకుండా ఒక్క చంద్రబాబును మాత్రమే తిట్టడం ఏమిటని గుస గుసలాడుకంటున్నారని సమాచారం.

ఈ సారి తిడితే పెద్ద పార్టీ అయిన తమనే తిట్టాలని, విమర్శించాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారట. అప్పుడే ప్రతి విమర్శలు చేయడానికి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారట. లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీలా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందని అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. అందుకే కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ అయిన డీకే అరుణ, రేవంత్ రెడ్డిలను ప్రోత్సహించి తాజాగా కేసీఆర్ మీద విరుచుపడేలా చేశారని సమాచారం. ఈ సారి నుంచి తమనే టార్గెట్ చేయాలని టీఆర్ఎస్ నేతలకు ఈ దెబ్బతో కౌంటర్ వేశారట.. సో.. అదండీ సంగతి.. తెలంగాణ తిట్ల లొల్లి కథ.

First Published:  6 Oct 2018 7:02 PM GMT
Next Story