Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్, చరణ్ తో మళ్లీ వర్క్ షాప్

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడనే వార్త మాత్రమే అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టుకు డీవీవీ దానయ్య నిర్మాత అనే విషయం మాత్రమే తెలుసు. ఈ రెండు వార్తలు మినహాయిస్తే, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు బయటకొచ్చిన ప్రతి వార్త పుకారు కిందే లెక్క. ఇప్పుడు అలాంటిదే మరో రూమర్ ఒకటి ఫ్రెష్ గా బయల్దేరింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మరో వర్క్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ […]

ఎన్టీఆర్, చరణ్ తో మళ్లీ వర్క్ షాప్
X

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడనే వార్త మాత్రమే అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టుకు డీవీవీ దానయ్య నిర్మాత అనే విషయం మాత్రమే తెలుసు. ఈ రెండు వార్తలు మినహాయిస్తే, ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు బయటకొచ్చిన ప్రతి వార్త పుకారు కిందే లెక్క. ఇప్పుడు అలాంటిదే మరో రూమర్ ఒకటి ఫ్రెష్ గా బయల్దేరింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మరో వర్క్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ వర్క్ షాప్ కంప్లీట్ అయిన తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ఈ ఇద్దరు హీరోలతో ఇప్పటికే ఓ వర్క్ షాప్ ముగిసింది. కాలిఫోర్నియా వెళ్లి మరీ ఆ వర్క్ షాప్ లో పాల్గొన్నారు చరణ్, తారక్. ఇప్పుడు హైదరాబాద్ లోనే రెండో వర్క్ షాప్ ఉంటుందట.

ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ కంప్లీట్ చేశాడు. అటు చెర్రీ కూడా బోయపాటి సినిమాను నవంబర్ నెలాఖరుకు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వీళ్లిద్దరితో కలిపి వర్క్ షాప్ ప్లాన్ చేస్తాడట రాజమౌళి. ఈ లెక్కన చరణ్-తారక్ సినిమా 2019లో కూడా రిలీజ్ అవ్వదేమో.

First Published:  7 Oct 2018 12:35 AM GMT
Next Story