Telugu Global
Cinema & Entertainment

అయినా దేవదాస్ హిట్ కాలేదు !

దేవదాస్ థియేటర్లలోకి వచ్చింది. నెగెటివ్ టాక్ తో స్టార్ట్ అయింది. ఆ మూవీకి వసూళ్లు కూడా టాక్ కు తగ్గట్టే వచ్చాయి. అయితే ఆ మూవీ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన నోటా సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో అంతా మరోసారి దేవదాస్ వైపు దృష్టిసారించారు. నోటా ఫ్లాప్ తో దేవదాస్ జాతకం మారిపోతుందని అంచనా వేశారు. కానీ దేవదాస్ మాత్రం కోలుకోలేకపోయాడు. నోటా బాగాలేదని తెలిసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా […]

అయినా దేవదాస్ హిట్ కాలేదు !
X

దేవదాస్ థియేటర్లలోకి వచ్చింది. నెగెటివ్ టాక్ తో స్టార్ట్ అయింది. ఆ మూవీకి వసూళ్లు కూడా టాక్ కు తగ్గట్టే వచ్చాయి. అయితే ఆ మూవీ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన నోటా సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో అంతా మరోసారి దేవదాస్ వైపు దృష్టిసారించారు. నోటా ఫ్లాప్ తో దేవదాస్ జాతకం మారిపోతుందని అంచనా వేశారు.

కానీ దేవదాస్ మాత్రం కోలుకోలేకపోయాడు. నోటా బాగాలేదని తెలిసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉన్నారు తప్ప, దేవదాస్ ఆడుతున్న థియేటర్లకు మాత్రం పోలేదు. ఫలితంగా ఈ సినిమా గత వారం చాలా తక్కువ వసూళ్లు నమోదు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో మరో పెద్ద సినిమా లేకపోవడం వల్ల దేవదాస్ సినిమాకు ఆమాత్రమైనా వసూళ్లు వస్తున్నాయి.

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కింది దేవదాస్ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నాగార్జున మరోసారి ఫ్రెష్ గా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. థ్యాంక్స్ మీట్ పెట్టాడు. రెండో విడత ప్రొడ్యూసర్ తో కలిసి ఛానెళ్లు చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.

First Published:  8 Oct 2018 6:10 AM GMT
Next Story