Telugu Global
Cinema & Entertainment

అమెరికా'లో ఆపరేషన్ చేయించుకోనున్న తేజు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ “తేజ్ ఐ లవ్ యు” ఫ్లాప్ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ అని తెలియగానే డైరెక్ట్ గా అమెరికా వెళ్ళిపోయాడు తేజు. ఎక్కువ లావు అవ్వడం వల్ల కూడా ఫ్లాప్స్ వస్తున్నాయి అని సాయి ధరం తేజ్ గట్టిగా నమ్ముతున్నాడు. అందుకోసం అర్జెంట్ గా బరువు తగ్గాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే లైపో ద్వారా తగ్గాలని డిసైడ్ అయ్యాడు. అందులో […]

అమెరికాలో ఆపరేషన్ చేయించుకోనున్న తేజు
X

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ “తేజ్ ఐ లవ్ యు” ఫ్లాప్ సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ అని తెలియగానే డైరెక్ట్ గా అమెరికా వెళ్ళిపోయాడు తేజు. ఎక్కువ లావు అవ్వడం వల్ల కూడా ఫ్లాప్స్ వస్తున్నాయి అని సాయి ధరం తేజ్ గట్టిగా నమ్ముతున్నాడు. అందుకోసం అర్జెంట్ గా బరువు తగ్గాలన్న ప్రయత్నాలు ఫలించలేదు.

అందుకే లైపో ద్వారా తగ్గాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగానే తేజు అమెరికా వెళ్ళాడని, ప్రస్తుతం ఆపరేషన్ బిజీలో ఉన్నాడని, ఆపరేషన్ పూర్తయ్యాక ఇండియా తిరిగి వస్తాడని చెబుతున్నారు.

నిజానికి సినిమాల్లోకి రాకముందు తేజు బాగా లావుగా ఉండేవాడు. కేవలం సినిమాల్లోకి రావాలనే ధ్యేయంతో బరువు తగ్గాడు. అందుకోసం ఆరు నెలలు కష్టపడి మరి బరువు తగ్గాడు. వచ్చిన కొత్తలో తేజు ఫిట్ గానే ఉన్నాడు. కానీ క్రమంగా మళ్ళీ లావు అయ్యాడు. ప్రస్తుతం తేజు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తప్ప ఇంకా ఏ ఒక్క సినిమా కూడా సైన్ చెయ్యలేదు తేజు.

First Published:  9 Oct 2018 1:33 AM GMT
Next Story