Telugu Global
NEWS

జూ.ఎన్టీఆర్ పట్ల బాబు సాఫ్ట్ కార్నర్...?

ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చుక్కలు చూపించారు అధికార పక్షం వాళ్లు. ఏపీలో ఆ సినిమా విడుదలకు ముప్పతిప్పలు పెట్టారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు చాలా ఆటంకాలు కల్గించారు. ఆ సమయంలో బాలయ్య సినిమా కూడా విడుదలకు రెడీగా ఉండటంతో జూనియర్ సినిమాకు ఇబ్బందులు కల్పించారు. థియేటర్లను దొరకనీయకుండా చేశారనే పేరు వచ్చింది. అప్పట్లో చంద్రబాబు కుటుంబం తారక్ తో ఎలా వ్యవహరిచిందో అంత ఈజీగా మరిచిపోయే అంశం కాదు. […]

జూ.ఎన్టీఆర్ పట్ల బాబు సాఫ్ట్ కార్నర్...?
X

ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చుక్కలు చూపించారు అధికార పక్షం వాళ్లు. ఏపీలో ఆ సినిమా విడుదలకు ముప్పతిప్పలు పెట్టారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలకు చాలా ఆటంకాలు కల్గించారు.

ఆ సమయంలో బాలయ్య సినిమా కూడా విడుదలకు రెడీగా ఉండటంతో జూనియర్ సినిమాకు ఇబ్బందులు కల్పించారు. థియేటర్లను దొరకనీయకుండా చేశారనే పేరు వచ్చింది.

అప్పట్లో చంద్రబాబు కుటుంబం తారక్ తో ఎలా వ్యవహరిచిందో అంత ఈజీగా మరిచిపోయే అంశం కాదు.

బాలయ్య సినిమాతో తారక్ ఢీ కొట్టాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చింది. దానికి తోడు లోకేష్ కూడా తోడయ్యాడు. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లను దొరకనీయకుండా కుట్ర పన్నారనే అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి.

చివరకు చాలా ఊర్లలో తారక్ సినిమాకు థియేటర్లే దొరకలేదు. బాలయ్య సినిమానే ఎక్కువ థియేటర్లను ఆక్రమించేసింది. లోకేష్ రంగంలోకి దిగి తారక్ సినిమాకు థియేటర్లు దొరకకుండా చేశాడనే పేరొచ్చింది అప్పుడు.

అదలా ఉంటే…. ఇప్పుడు మాత్రం తారక్ సినిమా పట్ల బాబు ప్రభుత్వం సాఫ్ట్ గా వ్యవహరిస్తోంది. త్వరలో విడుదల కానున్న తారక్ సినిమా ‘అరవింద సమేత..’కు ప్రత్యేక షోలు వేసుకోవడానికి బాబు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు ఇలా వ్యవహరిస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.

First Published:  9 Oct 2018 9:30 AM GMT
Next Story