చిన్న సినిమా ఆలోచనలో ద‌ర్శ‌కేంద్రుడు

అలనాటి మేటి ద‌ర్శ‌కేంద్రుడు అయిన రాఘ‌వేంద్ర‌రావు గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. అయితే మళ్ళి ఇన్నాళ్ళకి ఆయన ఒక సినిమా చేద్దాం అని డిసైడ్ అయ్యాడట. అవును ఆయన ఇప్పుడు ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేయాల‌నుకుంటున్నాడట.

ఇంత‌కీ అసలు విష‌యం ఏంటంటే ఈమధ్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగి పోయింది. స్టార్ హీరోల సినిమాలు మినిమం 40 నుండి 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే “పెళ్లి చూపులు” “ఆర్ ఎక్స్ 100” “కేరాఫ్ కంచరపాలెం” చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది సంచ‌ల‌నం సృష్టించాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాల స్పూర్తితో రాఘవేంద్ర రావు 50 లక్షల బడ్జెట్‌తో కంటెంట్ ప్రధానమైన సినిమాను తీయాలనుకుంటున్నాడు. అందరూ కొత్తవాళ్ళతోనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడట ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. ఇంకా ఈ సినిమాకి సంభందించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.