హీరోగా తరుణ్ భాస్కర్

“పెళ్లి చూపులు” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ కాస్త సమయం తీసుకొని చేసిన సినిమా “ఈ నగరానికి ఏమైంది”. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత సినిమాని కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లోనే చేయబోతున్నాడు తరుణ్ అనే వార్తలు ఇండస్ట్రీ లో హలచల్ చేసాయి. ఈ సినిమా రానాతో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి స‌మాచారం లేదు.

అయితే త‌రుణ్ భాస్క‌ర్ ఇప్పుడు న‌టుడుగా మారి ఓ సినిమా చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ మొత్తం తీవ్రవాద నేపథ్యంలో ఉంటుంద‌ట‌. ఇందులో తరుణ్‌ భాస్కర్‌ హైదరాబాద్‌ పాతబస్తీ యువకుడిగా కనిపిస్తారని టాక్‌. తమిళ యువకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలో సెట్స్‌ మీదకు వెళ్తుందని తెలిసింది. చిత్ర పరిశ్రమకు తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడిగా పరిచయమైనా కూడా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేస్తుండ‌టం విశేషం. మ‌రి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త‌రుణ్ భాస్క‌ర్ నటుడిగా ఎంతవ‌ర‌కు రాణిస్తాడో చూడాలి మరి.