మాజీ సీబీఐ డైరెక్టర్ కుమారుడిపై ఈడీ రైడ్స్‌

గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన, మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడిపై ఈడీ పంజా విసిరింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో బెంగళూరు, హైదరాబాద్‌లోని విజయరామారావు కుమారుడు శ్రీనివాస్‌ ఇళ్లు, ఆఫీస్‌ లలో దాడులు చేశారు.

పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో శ్రీనివాస్ బ్యాంకుల నుంచి 304 కోట్ల రుణం తీసుకున్నారు. అందుకు తనఖా ఆస్తులుగా తప్పుడు పత్రాలను పెట్టి బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ ఇది వరకే కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈడీ కూడా పంజా విసిరింది.

సీబీఐ మాజీ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు… పలు కేసుల విషయంలో చంద్రబాబుకు ముఖ్య సలహాదారుగా పనిచేశారు. జగన్‌ ఆస్తులపై సీబీఐ దాడుల సమయంలో నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఈ విజయరామారావే తన అనుభవంతో దిశానిర్దేశం చేశారని చెబుతుంటారు.

చంద్రబాబు, టీడీపీ మీడియా సలహా మేరకే లక్ష్మీనారాయణ… విజయరామారావు వద్ద శిష్యుడు తరహాలో సూచనలు తీసుకుని ముందుకెళ్లారని చెబుతుంటారు. చంద్రబాబు తన సూచనలను విజయరామారావుకు ఇవ్వగా ఆయన లక్ష్మీనారాయణకు వాటిని నూరిపోసేవారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం విజయరామారావు టీఆర్ ఎస్ లో ఉన్నారు.